Home

»

Tv News

Ye Devi Varamo Neevu: రాకీని ఇంట్లో నుండి పంపించేసేలా చేసిన అంజలి!

Nov 8, 2026 10:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -110 లో... అంజలి పడిపోతుంటే గీత పట్టుకుంటుంది. దాంతో అంజలి మా అమ్మ నన్ను ముట్టుకుందని మురిసిపోతుంది. అదే విషయం మనీష్ తో చెప్తూ మురిసిపోతుంది. అలా చెప్పడం భవిత వింటుంది. మనీష్ వెళ్ళాక.. ఏంటి ఏదో సంతోషంగా ఉన్నావ్.. ఆ అమ్మ ముట్టుకుంటే మురిసిపోతున్నావ్.. తన అదృష్టం నీకు రావాలనా అని భవిత అంటుంటే నీకు తెలియదు భవిత కానీ ఇప్పుడే చెప్పలేనని అంజలి అనుకుంటుంది.

ఆ తర్వాత నీ ప్లేస్ లో బిచ్చగాళ్లున్నా మా అమ్మ అలాగే చేసేదని భవిత అంటుంది. ఆ తర్వాత అందరు హాల్లోకి వస్తారు. అప్పుడే రాకీ బ్యాగ్ తో వస్తాడు. ఎక్కడికి అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. హాస్టల్ కి వెళ్తున్నానని ఇంట్లో ఉంటే చదవలేకపోతున్నానని రాకీ అంటాడు. వీళ్ళందరు చదవట్లేదా ఆని గీత అంటుంది. లోపలకు వెళ్ళు అనగానే రాకీ హ్యాపీగా వెళ్తుంటే ఆగండి రాకీ బాబు అని అంజలి అంటుంది. 

పాపం తను శ్రద్దగా చదవాలనుకున్నప్పుడు చదువుకోనివ్వాలి అంతే గానీ ఇలా చేస్తే ఎలా అని అంజలి అనగానే అవునని గీత అంటుంది. సరే రా నువ్వు మన కాలేజీ హాస్టల్ కి వెళ్ళు అని గీత అనగానే అదేంటీ అమ్మగారు అయన ఇక్కడ ఉంటే లగ్జరీ కి అలవాటు అయి చదవనని వెళ్తుంటే ఇప్పుడు మీ హాస్టల్ కి అంటే ఎలా అని అంజలి అంటుంది. 

వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటాడని అంజలి అంటుంది. రాకీ మనసు లో అంజలిని తిట్టుకుంటాడు. రాకీ వెళ్తుంటే మనీష్ డబ్బు ఇస్తాడు‌. ఎందుకు ఇస్తున్నారు బాబు అమ్మగారు ఇచ్చిన డబ్బు ఉంటుంది కదా అని అంజలి అడ్డుపడుతుంది. ఇక వేరే దారి లేక రాకీ ఇంట్లో నుంచి బయటకి వస్తాడు. ఆ తర్వాత బయటికి వచ్చాక అంజలి అతన్ని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Ye Devi Varamo Neevu Episode 110, Ye Devi Varamo Neevu November 7th Episode, Ye Devi Varamo Neevu Serial, e Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Latest Episode, Star Maa Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com