Home

»

Tv News

Godavari serial: జానును హగ్ చేసుకున్న సూర్య.. కోపంతో రగిలిపోయిన సంజయ్!

Nov 8, 2026 11:19AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-158లో.. నందు, గౌతమి, వాళ్ళ నానమ్మ, శారద, మురళీ మాట్లాడుకుంటారు. నందు దగ్గరున్న కొత్త ఫోన్ ని గౌతమి చూస్తూ మురిసిపోతుంది. ఎంత బాగుందో అంటు గౌతమి అనగానే మొన్ననే జాబ్ లో జాయిన్ అయ్యావ్.. ఇన్ని డబ్బులు పెట్టి ఈ ఫోన్ కొనడం అవసరమా అని నానమ్మ అడుగగా.. నా భార్యని ఏం అయినా ఉంటే ఊరుకోనని మురళి అంటాడు. ఓయబ్బో పెళ్ళాన్ని ఏం అననివ్వడం లేదు.. చూశావా శారద  అని నానమ్మ అనగానే.. అమ్మా నందు.. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో ఇంత ఫోన్ అవసరమా అని నందు వాళ్ళ అమ్మ శారద అడుగుతుంది.

ఆఫీస్ లో బాస్ ఇచ్చాడని తెలిస్తే అందరు రకరకాలుగా మాట్లాడుకుంటారని నందు అనుకుంటుంది. నేను టైమ్ కి ఆఫీస్ కి వెళ్ళినందుకు.. వర్క్ బాగా చేసినందుకు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు.. నాతో పాటు మరో ముగ్గురికి ఇచ్చారని నందు అనగానే ఓహో అవునా అని అందరు అంటారు. అప్పుడే క్లాప్స్ కొడుతూ అక్కడికి జాను వస్తుంది.

సూపర్ అక్క.. ‌ఇలా జాయిన్ అయ్యావో లేదో అలా ఫోన్ వచ్చేసింది సూపర్ అక్కా అని జానూ అంటుంది. గౌతమి నువ్వు  కూడా అక్కలాగా బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని జాను అనగానే చదువుకోవాలంటే డబ్బులుండాలి కదా.. నాకు డబ్బులు ఎవరిస్తారు.. నువ్వేమో గొప్పింటి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయావని గౌతమి అంటుంది.  ఇదిగో డబ్బులు అని తీసి ఇవ్వబోతుంటే.. అవసరం లేదు.. వేరే వాళ్ళు ఇచ్చారని గౌతమి అంటుంది.

ఆ తర్వాత మురళీ షాప్ కోసం జాను డబ్బులు ఇస్తుంటే వద్దని అంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చారని మురళీ అంటాడు. ఎవరు అని జాను అడుగగా ఎవరైతే నీకు ఎందుకు .. ఎండలో కందిపోతావ్.. వెళ్ళమని నందు అనగానే జానూ ఏం చేయలేక వెళ్ళిపోతుంది‌. ఆ తర్వాత జాను వెళ్తుంటే తన దగ్గరికి కిన్నెర వస్తుంది‌.

అక్క బాధపడుతున్నావా అని కిన్నెర అడుగగా లేదమ్మా అని జాను అంటుంది. గౌతమి అక్క కాలేజీ ఫీజుని సూర్య కట్టాడు. మురళీ బావ షాప్ కి కూడా సూర్యనే డబ్బులు ఇచ్చాడని కిన్నెర అనగానే జాను షాక్ అవుతుంది. వెంటనే సూర్య దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావ్.. మా వాళ్ళకి ఎందుకు దగ్గరవ్వాలని డబ్బులు ఇచ్చావ్.. ఇదిగో తీస్కో ఇందులో డబ్బులు ఉన్నాయని జానూ ఇస్తుంది. కానీ సూర్య తీస్కోడు. జానూ  ఫైర్ అవుతుంది.

అదే సమయంలో జానూ, సూర్య ఇద్దరిని కార్ లో నుండి సంజయ్ చూస్తాడు.  అది గమనించిన సూర్య.. జానూ చేతలని పట్టుకొని .. నీ దగ్గర నేను డబ్బులు తీస్కోను.. అని జానూని హగ్ చేసుకుంటాడు. అది చూసిన సంజయ్ కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూర్య చెంప  చెల్లుమనిపిస్తుంది జాను. డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి గదిలో బెడ్ పై సంజయ్ కోపంగా కూర్చొని ఉంటాడు. జానూ రాగానే ఇంత బాగా యాక్ట్ చేస్తావనుకోలేదని.. సూర్యతో ఎందుకు తిరుగుతున్నావని సంజయ్ అడుగుతాడు. మర్యదగా, సంస్కారంగా మాట్లాడండి అని జానూ అనగానే సూర్యకి ఎందుకు డబ్బులు ఇచ్చావని జానూని సంజయ్ అడుగుతాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Godavari Serial Episode 158, Godavari Serial Today Episode, Godavari Serial November 7 Episode, Godavari Latest Episode, Star Maa Serial, Godavari Latest Episode, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com