Home

»

Tv News

Podarillu Serial: ముద్దులదాకా వెళ్ళిన కేశవ, శైలు.. మహా పేరుని షాప్ కి పెడతారా?

Nov 8, 2026 10:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-255 లో... మాధవ, మనీషా పెళ్లి గురించి అందరూ మాట్లాడతారు. తమ తల్లిదండ్రులు ఒప్పుకోరని, వాళ్లు టిట్లాతోనే చేయాలని చూస్తున్నారని బన్సీ అంటాడు. వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తానంటాడు మాధవ. కానీ అది కుదిరే పని కాదేమోనని చక్రి అంటాడు. పెద్దవాళ్లను ఒప్పించకపోతే ప్రతి ఆడపిల్ల పుట్టింటికి దూరమవుతుందని మాధవ అంటాడు. తన ఇంటికి వెళ్లడానికి మనీషా భయపడుతుంది. వాళ్లు అక్కడికి కూడా వస్తారేమో అంటుంది. కొన్నాళ్లు ఇక్కడే ఉండండి దీపావళి కూడా వస్తోంది ఇక్కడే జరుపుకుందామని చక్రి అనడంతో ఆమె ఉంటుంది. ఆ తర్వాత మాధవ రౌడీలతో హీరోలా ఫైట్ చేశాడని మనీషా చెప్పడంతో తమ్ముళ్లు హీరో అంటూ ఆటపట్టిస్తారు.

మరుసటి రోజు ఉదయం మహా ఆఫీసుకు రెడీ అవుతుంది. చక్రి మాట్లాడబోతే విసుక్కుంటుంది. స్కూటీ పాడైందని తనే డ్రాప్ చేస్తానని చక్రి అంటే ఆటోలో వెళ్తానని మొదట అన్న మహా తర్వాత ఒప్పుకుంటుంది. కారులో వెళ్తూ ఈ మధ్య సరిగా మాట్లాడటం లేదని, అమ్మాయిలను ఎక్కించుకోవడమే కారణమా అని చక్రి అడుగుతాడు. అలాంటిదేమీ లేదని మహా అంటుంది. దారిలో విక్కీ కారు ఆగిపోవడం చక్రి చూసి లిఫ్ట్ అడుగుతాడని మహాను మాటల్లో పెట్టి చూడకుండా చేస్తాడు.. విక్కీ ఆపమని అడుగుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు. లక్కీ అంటూ విక్కీ అరవడంతో మహా కారు ఆపమంటుంది. విక్కీ కారు పాడైందని చెప్పి ఇదే కారులో వెళ్దామని మహా అంటే వెనకాల కూర్చో ప్రాజెక్టులో మార్పులు చెప్పాలని విక్కీ అనడంతో చక్రి ఉడుక్కుంటాడు. వాళ్లు క్లోజ్ గా ఉండటం చూసి తిట్టుకుంటూ కావాలని బ్రేక్ వేసి విక్కీకి దెబ్బ తగిలేలా చేస్తాడు. తర్వాత వాళ్లను డ్రాప్ చేసి మహా స్కూటీ తాళాలు తీసుకుని వెళ్తాడు.

మరోవైపు కేశవ తన షాపులో లక్ష్మీ పూజ కోసం శుభ్రం చేస్తుండగా శైలు వస్తుంది‌ చోటూని పంపించేసి ఇద్దరూ రొమాన్స్ లో మునిగిపోతారు. షాపు విషయంలో శైలు మళ్లీ గొడవ పడబోతే కేశవ ఆపుతాడు. ఒకప్పుడు ప్రేమగా మాట్లాడే బుస్సే నచ్చేదని, రోజూ గొడవ పడే బుస్సు వద్దని, ఇదే మన జీవనాధారం అని సర్ది చెప్తాడు. దీంతో శైలు కరిగిపోయి హగ్ చేసుకుంటుంది. ముద్దు పెట్టబోతుండగా మహా స్కూటీని తోసుకుంటూ చక్రి వచ్చి చూసి అరుస్తాడు.. నాన్నో అన్నో చూస్తే ఏమయ్యేదని శైలుని తిట్టి పంపించి స్కూటీ రిపేర్ చేయమని చెప్తాడు.. నాకు హగ్ కే దిక్కులేదు వీళ్లు ముద్దులదాకా వెళ్లారని తిట్టుకుంటాడు. ఇక కేశవ షాపులో లక్ష్మీ పూజ చేసి పేరు మార్చాలని ఇంట్లో చెప్తే రచ్చ జరుగుతుంది‌.. మహా పేరు పెట్టాలని చక్రి, మాధవ పేరు అని మహా, మనీషా మరో పేరు చెప్తుంది, శైలు పేరు ఎవరు చెప్పకపోవడంతో తను అలుగుతుంది. నారాయణ అందరి పేర్లు చీటీలు వేసి తీయమనడంతో మహా చీటీ తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podarillu Serial Episode 255, Podarillu November 7th Episode, Podarillu Today Episode, Podarillu Latest Episode, Star Maa Serial, Podarillu Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com