చిత్రలహరి మూవీలో ఆఫర్ శేఖర్ మాస్టర్ వల్ల వచ్చింది
on Feb 2, 2024

ఢీ షో ద్వారా ఎంతోమంది డాన్స్ మాస్టర్లు ఫేమస్ ఐనా కూడా యష్ మాష్టర్ పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చి శేఖర్ మాస్టర్ పక్కనే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా దుమ్ములేపాడు యష్ మాస్టర్. అలాగే యష్ మాస్టర్ మూడు సార్లు ఢీ టైటిల్ విన్ అయ్యాడు. అలాగే ధమాకా మూవీలో రవితేజకు ఒక సాంగ్ కూడా కోరియోగ్రఫీ చేసాడు. అలాంటి యష్ మాస్టర్ సాయి ధరమ్ తేజ్ నటించిన "చిత్రలహరి" మూవీలోని "గ్లాస్మేట్స్" అనే సాంగ్ ఆఫర్ శేఖర్ మాస్టర్ వల్ల వచ్చిందంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
శేఖర్ మాస్టర్ గురించి ఒక విషయం చెప్పాలి "సాయి ధరమ్ తేజ్ గారి సాంగ్ ఒకటి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తూ ఆ రిహార్సల్స్ లో ఉన్నారు..అదే టైములో ఒకరోజు నేను ఫోన్ చేసి సర్ ఇలా నేను షూట్ కి రావొచ్చా, చూడొచ్చా అని అడిగితే రమ్మని పిలిచారు. బ్రేక్ లో శేఖర్ మాస్టర్, సాయి ధరమ్ తేజ్ గారు లొకేషన్ లో నిలబడ్డారు నేను చాలా దూరంలో నిలబడ్డాను. శేఖర్ మాస్టర్ అప్పుడు నన్ను పిలిచి తేజ్ గారికి పరిచయం చేశారు. ఎవరైనా ఆ స్టేజిలో ఉన్నప్పుడు ఏమని పరిచయం చేస్తారు బాగా చేస్తారు అని సరిపెడతారు అంతే కదా కానీ శేఖర్ మాస్టర్ అలా అనలేదు నాకంటే బాగా చేస్తాడు యష్ అని చెప్పారు. మంచి కొరియోగ్రాఫర్ ఒక సారి మీరు కూడా చూడండి అని పరిచయం చేశారు. నాకంటే బాగా చేస్తారు అని ఎవరూ అస్సలు చెప్పరు కానీ శేఖర్ మాష్టర్ అలా నా గురించి చెప్పేసరికి నాలో నాకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. శేఖర్ మాస్టర్ పరిచయం చేసిన వారం రోజులలోపే తేజ్ గారు నన్ను పిలిచి గ్లాస్ మేట్స్ సాంగ్ ఆఫర్ ఇచ్చారు.
శేఖర్ మాస్టర్ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలు." అన్నాడు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో "ఆకాశం దాటి వస్తావా" అనే మూవీలో హీరోగా యష్ నటించాడు. ఆ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోందన్నాడు. ఢీ స్టేజి మీదకు కోరియోగ్రఫీ చేయమని ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వెళ్తా..అదే తనకు చాలా ఇష్టమైన పని అని అన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో చైతన్య మాస్టర్ ని, అలాగే తన దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి చివరికి బ్లడ్ కాన్సర్ తో మరణించిన కేవల్ ని కూడా తలుచుకుని బాధపడ్డాడు. అలాగే లైఫ్ లో ఎప్పుడూ ప్లాన్ ఏ , ప్లాన్ బి ఉండాలి. సక్సెస్ ఐతే ఓకే కాకపొతే లైఫ్ ని ఎండ్ చేసుకోకుండా ప్లాన్ బితో లైఫ్ లో ముందుకెళ్లాలి అని ఒక పాయింట్ ని చెప్పాడు యష్ మాస్టర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



