గుప్పెడంత మనసులో ఆ పాత్ర ముగిసినట్లేనా!
on Oct 2, 2023
'గుప్పెడంత మనసు' సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతూ గత కొన్ని రోజుల నుండి రేటింగ్ లో వెనుకబడింది. ఈ సీరియల్ ప్రస్తుతం మంచి ట్విస్ట్ లతో ముందుకు సాగుతు మళ్ళీ టాప్-10 లోకి వచ్చేసింది. రిషి వసుధారల లవ్ స్టోరీకి, జగతి రిషిల మదర్ ఎమోషన్ కీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. గతంలో రిషి, వసుధారల పెళ్లి జరిగితే సీరియల్ కి శుభం కార్డు పడినట్లే అని అందరు భావించారు. కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత రిషిని ప్రాణాలతో కాపాడుకోవాలనే ప్రయత్నంలో.. జగతి తన కొడుకు రిషిపై నింద వేసి కాలేజ్ నుండి పంపించేసి, శైలేంద్ర భారీ నుండి కాపాడుకుంటుంది. ఆ విషయం తెలియని రిషి మోసం చేశారంటూ వాళ్ళ నుండి దూరంగా వెళ్తాడు. అయిన శైలేంద్ర కుట్రలతో రిషికి ప్రమాదం తలపెడుతునే ఉన్నాడు. కొన్ని రోజులకి ఎలాగైనా మళ్ళీ రిషి తిరిగి వస్తే కాలేజీ నాకు రాకుండా పోతుందని శైలేంద్ర అనుకొని రిషిని చంపెయ్యడానికి రౌడీని పురమాయిస్తాడు. ఇక ఆ రౌడీ రిషిని గన్ తో షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ రిషికి తగలకుండా జగతి అడ్డుపడుతుంది. దాంతో జగతికి ఆ బుల్లెట్ తగులుతుంది.
ఇక తనని కాపాడబోయి తన తల్లి ప్రాణాల మీదకి తెచ్చుకుందని రిషి అర్థం చేసుకుంటాడు. ఇక జగతి హాస్పిటల్ లో జగతిని ఆ పరిస్థితులలో చూసిన రిషి చలించిపోతాడు. ఇక జగతిని అమ్మ అని పిలుస్తాడు రిషి. అమ్మ అని రిషి చేత పిలిపించుకోలేక జగతి తనలో తనే చాలాసార్లు భాదపడింది. రిషి అమ్మ అని పిలవడంతో ఎన్నో ఏళ్ళుగా జగతి కల తీరినట్టైంది. అయితే నువ్వు ఏం చెప్పిన చేస్తాను, నీ ఋణం తీర్చుకుంటానంటు జగతికి రిషి మాటిస్తాడు. నువ్వు వసుధార పెళ్లి చేసుకోవాలని జగతి తన కోరికని చెప్తుంది. అయితే తాజాగా వచ్చిన గుప్పెడంత మనసు ప్రోమోలో వసుధార, రిషి ఇద్దరు పెళ్లి చేసుకొని జగతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండగా.. జగతికి ఏదో అయినట్లు అందరు తన వైపు చూసి ఆశ్చర్యపోతారు. అసలు జగతికి ఏం అయింది? చనిపోయిందా? తన క్యారెక్టర్ కి ఎండ్ కార్డ్ పడినట్లేనా అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



