కేడీ బ్యాచ్ గురించి తెలుసుకున్న వసుధార.. ఏం చేయనుంది!
on Jun 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -780 లో వసుధార క్లాస్ కి వెళ్ళి, క్లాస్ తీసుకుంటూ ఉంటే వేరొక లెక్చరర్ వచ్చి వసుధారని అవమానిస్తాడు. వెంటనే వసుధార ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి.. నన్ను ఆ క్లాస్ కి ఎందుకు పంపించారు.. నన్ను వేరే లెక్చరర్ వచ్చి ఇన్సల్ట్ చేసాడని చెప్తుంది. అలా అనగానే ఆ పని చేసింది ఆ కేడీ బ్యాచ్ అని ప్రిన్సిపాల్ అంటాడు. ఆ కేడీ బ్యాచ్ కి ఇలా లెక్చరర్ ని అట పట్టించడం అంటే సరదా అని ప్రిన్సిపాల్ చెప్తాడు.
మరొకవైపు ఆ కేడీ బ్యాచ్ ఒక దగ్గర కూర్చొని.. కొత్తగా వచ్చిన లెక్చరర్ ని భలే ఆట పట్టించామని నవ్వుకుంటారు. ప్రతిసారీ వచ్చిన లెక్చరర్ ని ఇలా ఆట పట్టించడం మనకు సరదాగా ఉంది.. ఇలా వచ్చిన లెక్చరర్ వారం రోజులకే వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఈ లెక్చరర్ కూడా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతుందని ఆ బ్యాచ్ అంతా అనుకుంటారు. మరొకవైపు వసుధారతో ఇంకొక లెక్చరర్ కేడీ బ్యాచ్ గురించి చెప్తుంది. మేడం వాళ్ళతో జాగ్రత్త వాళ్ళకి కాలేజీ మొత్తం భయపడుతుంది. ప్రిన్సిపాల్ కూడా భయపడతాడంటే మీరే అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంతగా లెక్చరర్ తో ఆడుకుంటారో అని ఆ మేడం వసుధారతో అంటుంది. కేడీ బ్యాచ్ లో నలుగురు ఉంటారు. అందులో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. వాళ్ళు ఇలా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏం అనరా అని వసుధార అడుగగా.. "వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్లే చేస్తారు. అందులో ఒక అబ్బాయి పాండియన్. అతనే కేడి బ్యాచ్ లీడర్. అతని తండ్రి సిటీలోనే పెద్ద రౌడీ. అతనికి కొడుకు అంటే ప్రాణం. అంతా ఈ అబ్బయికి నచ్చినట్లే జరగాలి. లేదంటే ఇళ్ల మీదకి మనుషులని పంపిస్తారు. అందుకే వీళ్ళకి అందరూ భయపడతారు. ఎవరు ఎదురు చెప్పరు" వసుధారతో అంటుంది మేడం. ఏంటి మేడం ఈ కాలేజీ.. ఎక్కడైనా లెక్చరర్ కి స్టూడెంట్స్ భయపడుతారు. ఇక్కడ రివర్స్ ఉంది స్టూడెంట్స్ కి మంచి చెప్పాలి కదా అని వసుధార అంటుంది.
మరొక వైపు జగతి వర్క్ చేసుకుంటూ ఉండగా శైలేంద్ర వస్తాడు. కాలేజీ ఎండీ సీట్ గురించి మాట్లాడుతాడు. శైలేంద్ర నువ్వు మహేంద్ర జోలికి వెళ్ళకు.. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను కానీ ఇక ఉండను. రిషి వచ్చాక నేను నిజం చెప్పకున్నా, వసుధార చెప్తుందని శైలేంద్రకి వార్నింగ్ ఇస్తుంది జగతి. ఆ తర్వాత దేవయాని శైలేంద్ర దగ్గరికి వచ్చి.. నువ్వు జగతి జోలికి వెళ్ళకు తన గురించి నీకు తెలియదని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read