Home

»

Tv News

25 ఏళ్ల నాటి వడ్డే నవీన్ ముందే బయటపెట్టిన సీక్రెట్ సుమ!

Jun 8, 2026 3:26PM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ని అలరించిన హీరో వడ్డే నవీన్ దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మూవీ  జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ప్రస్తుతం ఆ మూవీ టీమ్ అంత  ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా  ఫేమస్  యాంకర్, నటి సుమ కనకాల    వడ్డే నవీన్ ఇంటికి వెళ్ళింది. ఒక ఇంటరెస్టింగ్ ఇంటర్వ్యూ నిర్వహించింది.  

ఇందులో నవీన్ ఫేమస్ సాంగ్ పెళ్ళిలోంచి జాబిలమ్మ నీకు అంత కోపం అనే సాంగ్ ని సుమా, నవీన్ కలిసి పాడారు. ఆ తర్వాత ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పింది.  " చాలా బాగుంది సినిమాలో నేను చేసాను గుర్తుందా" అంటూ సుమా ఆ మూవీ క్లిప్ ని చూపించింది. అలా అప్పట్లో నవీన్ తో కలిసి  నటించిన విషయాన్ని గుర్తు చేశారు. “1999లో జరిగిన షూటింగ్‌లో పెళ్లి చూపుల సన్నివేశంలో నేను కనిపిస్తాను. ఐతే అప్పటికే నేను గర్భవతిని కూడా. ఆ మూవీ డైరెక్టర్  ఈవీవీ సత్యనారాయణ గారు. ఈ మూవీ అప్పట్లో బిగ్ హిట్. ఈ  సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది” అని సుమ తెలిపారు. నవీన్ గారితో ఇంటర్వ్యూ అనేసరికి మనం చేసిన సినిమా కూడా ఉంది కదా అని ఇది బయటకు తీసా అంటూ సుమా ఆనందంతో చెప్పింది.

శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించిన చాలా బాగుంది చిత్రం అప్పట్లో ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో సుమ చిన్న పాత్రలో కనిపించింది.  25 ఏళ్ల  క్రితం  అప్పట్లో ఇలాంటి సోషల్ మీడియా లేదు కాబట్టి అంత వైరల్ కాలేదు కానీ ఇప్పుడు సుమా చూపించిన ఈ బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com