.webp)
కుక్కు విత్ జాతిరత్నాలు షోలో ఒక ఇంటరెస్టింగ్ విషయం జరిగింది. ఈ సండే స్పెషల్ లో వచ్చిన లవ్ థీమ్ లో ఎవరి జాతి రత్నం వాళ్లకు వచ్చారు. ఇందులో గోమతి స్పెషల్ గా డ్రెసప్ అయ్యి వచ్చింది. ఐతే హరి వచ్చి ఇప్పుడు రాసిన లెటర్ ఆయన చదవలేడు ఎందుకంటే ఆయనకు సిగ్గు ఎక్కువ. ప్రదీప్ లెటర్ నేను చదువుతా అన్నాడు. ఇక ఆ లెటర్ ఏంటో హరి చదివాడు. "ప్రియమైన ప్రదీప్ కి ఉమ్మ . ఓహ్ వెరీ డీప్.

నీ పేరు ప్రదీప్ నీ మీద నా లవ్వు వెరీ డీప్. మీరు యాంకరింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరికీ హాయ్ హలో అని వినిపిస్తే నాకు మాత్రం హాయ్ ఐ లవ్ యు అని వినిపిస్తుంది. అందరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం మీరు కనిపించినంత సేపు ప్రదీప్ ప్రదీప్ అని కొట్టుకుంటుంది. మీరు షోలో టేక్ ఏ షార్ట్ బ్రేక్ అని చెప్పండి కానీ ఎప్పటికీ నా హార్ట్ ని బ్రేక్ చేయకండి . ఇట్లు ప్రేమతో నిన్ను హగ్ చేసుకోవడానికి వస్తున్న నీ ప్రియురాలు. " " అని లెటర్ చదివాడు. ఇక గోమతి ప్రియా వచ్చి ప్రదీప్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇమ్మానుయేల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కి ఫస్ట్ జోడి అంటూ హింట్ ఇచ్చేసాడు. ఇక గోమతి ఐతే "ఈ షోలో ఏ థీమ్ పెట్టినా అందులో లవ్ థీమ్ మనదే. ఈయన నా ఆస్తి. ఈయన సంపాదిస్తున్న ఆస్తులన్నీ నాకే " అని చెప్పేసింది. తర్వాత స్పెషల్ గిఫ్ట్ తెచ్చానంటూ ఒక రోజా పువ్వు తెచ్చి అందులో ఉన్న రింగ్ ని ప్రదీప్ వేలుకి తొడిగింది. ఇక పక్కనే ఉన్న హరి, ఇమ్ము కలిసి రోజా పూరెక్కలు జల్లి సందడి చేశారు.




.webp)
