Home

»

Tv News

Jayam serial : ప్రీతి శ్రీమంతానికి విచిత్రమైన కండిషన్.. బాక్సింగ్ ఛాంపియన్‌గా గంగ మారాల్సిందేనా

Jun 9, 2026 10:43AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో......గంగ, రుద్రలని ఇంటికి భోజనానికి పిలుస్తుంది సుధా. వాళ్లకు భోజనం వడ్డించి తన కూతురు గురించి చెప్తూ బాధపడుతుంది సుధా. నా కుటుంబం మీద ఎవరి కన్నుపడిందో ఏంటో.. నా కూతురు నాకు దూరం అయ్యి ఇరవైరెండు సంవత్సరాలు అవుతుందని సుధా ఎమోషనల్ అవుతుంది. నిజం తెలిసి కూడా చెప్పలేకపోతున్నానని రంగా తినే దగ్గర నుంచి లేచి బయటకు వెళ్తాడు.

ఆ తర్వాత రంగా దగ్గరికి పైడిరాజు,లక్ష్మి వచ్చి.. ఏంట్రా మధ్యలో నుంచి వచ్చేసావని అడుగుతారు. మీరు నిజం తెలిసి కూడా వాళ్ళకి చెప్పట్లేదు.. పాపం సుధా అమ్మ ఎంత బాధపడుతుందోనని రంగా అంటాడు కానీ ఆ విశ్వ సర్ కి.. వద్దనుకొనే కదా దూరం పెట్టాడని పైడిరాజు అంటాడు. ఇన్ని సంవత్సరాలు అయింది. అతను మారలేదని అంటావా.. ముందు వాళ్ళకి నిజం చెప్పండి అని రంగా అంటాడు. ముందు రుద్ర బాబుకి చెప్పాలని లక్ష్మి అనగానే బావకి చెప్పను.. ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడని రంగా అంటాడు.

అప్పుడే గంగ వస్తుంది. అదంతా విందేమోనని టెన్షన్ పడుతారు. కానీ గంగ ఏం వినలేదు .. మీరు ఏదో దాస్తున్నారనిపిస్తుంది.. అదేంటో మీరు చెప్పేవరకు మేం అడగమని గంగ అంటుంది. ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి గంగ, స్నేహ, ఇందుమతి వెళ్లి శ్రీమంతం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తారు కానీ నువ్వు బాక్సింగ్ లో ఛాంపియన్ అయ్యాకే శ్రీమంతం అని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com