Home

»

Tv News

సరిగమప స్టేజి మీద లేడీ గెటప్ లో సుధీర్... తన గర్ల్ ఫ్రెండ్ అంటూ సందడి చేసిన ఇమ్ము

Nov 21, 2026 9:11AM

సరిగమప లేటెస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పాడిన సాంగ్స్ అన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఇకపోతే జడ్జెస్ లో అనిల్ రావిపూడి మిస్ అయ్యారు. ఆయన కామెడీని అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కూడా మిస్ అయ్యారు. ఐతే అనిల్ రావిపూడి ప్లేస్ లో సింగర్ మనో వచ్చారు. ఆయన కొంచెం కామెడీని పండించి అనిల్ రావిపూడి లేని లోటును తీర్చారు. ఐతే ఈ మొత్తం శనివారం ఎపిసోడ్ లో సుధీర్ - ఇమ్మానుయేల్ సెగ్మెంట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.

ఇందులో ఇమ్మానుయేల్ సుధీర్ గెటప్ లో వచ్చాడు. అతనిలాగే యాంకరింగ్ చేసాడు. సుధీర్ ఇమ్ములా చేసాడు. తర్వాత ఇమ్మానుయేల్ ఒక మంచి సాంగ్ పాడాడు. ప్రేమికుడు మూవీలోని ఒక సాంగ్ ఉంది . "ఓ చెలియా నా ప్రియా సఖియా " అని దాన్ని ఇమ్మానుయేల్ చక్కగా పాడి వినిపించాడు. ఇక తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను అంటూ ఒక పిక్ ని చూపించాడు. ఆ పిక్ చూసిన వాళ్లంతా షాకయ్యారు. ఇంతకు ఆ పిక్ ఎవరిదీ అంటే సుడిగాలి సుధీర్ ది . అది కూడా లేడీ గెటప్ లో కూర్చుని ఉన్న పిక్ అది చూసాక సుధీర్ నవ్వాపుకోలేకపోయాడు.

ఇమ్ము ఐతే ఆ పిక్ ని ముద్దు పెట్టుకుని నానా రచ్చ చేసాడు. ఆ పిక్ చూసాక మనో ఐతే " ఈ అమ్మాయి చాలా మోసగత్తె జాగ్రత్త. ఆమ్మో బెంగాల్ లో కనపడింది " అన్నారు. ఇక సుధీర్ "ఏరా కొంచెమన్నా మీకు జాలి దయ ఉన్నాయా మీకు. నువ్వు అంత బిల్డప్ ఇచ్చావు కదా జెన్యూన్ తొక్క తోలు అని  " అన్నాడు. "ఈమెకేమి తక్కువ . ఎంత అందంగా ఉందో " అన్నాడు ఇమ్ము. తర్వాత సిమ్రాన్ ఐతే "సుధీర్ అనంత్ సర్ శాన్ ఫ్రాన్సిస్కో గురించి చెప్పారు. ఇక ఫ్లైట్ బుక్ చేసే టైం వచ్చింది " అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు .

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com