Home

»

Tv News

యశ్వంత్ మాష్టర్... ఢీ షో విన్నర్ కన్ఫమ్... కోపంతో వెళ్లిపోయిన జానీ మాష్టర్

Nov 20, 2026 5:24PM

ఢీ సీజన్ 21 డబుల్ ఇంపాక్ట్ పేరుతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో లేదో కానీ కన్ను తెరిచి మూసేలోపు సీజన్ మాత్రం టక్కున ఐపోయింది. ఇలా స్టార్ట్ అవ్వగానే అలా గ్రాండ్ ఫినాలేలోకి వచ్చేసింది షో. ఈ ప్రోమో ఫుల్ వైరల్ అవుతోంది. అలాగే కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా దేనికి అవే అన్నట్టు ఉన్నాయి. ఇక ఈ ప్రోమోలో ఒక్కో పెర్ఫార్మర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక్కో లెవెల్ లో ఉంది. ఐతే టీవీ షోస్ లీక్స్ ప్రకారం  యశ్వంత్ మాష్టర్ విన్నర్ గా కంఫర్మ్ ఐపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రోమో కింద నెటిజన్స్ అంతా కూడా పెద్ద డిస్కషన్ పెట్టారు. "రియల్ విన్నర్ యశ్వంత్ మాష్టర్ . ఎన్ని సీజన్స్ మారినా మరో యశ్వంత్ మాష్టర్ ని మాత్రం ఢీ ఇవ్వలేకపోతోంది. నిజంగా యాష్ మాస్టర్ కోరీయోగ్రఫి చాలా బాగుంది. యాష్ మాస్టర్ - ఆర్నాల్డ్  విన్నర్ . యష్ మాస్టర్ సక్సెస్ ఫుల్ గా  4వ కప్పు కొట్టారు. చాలా యూనిక్ పెర్ఫార్మెన్స్ కంటెస్టెంట్ ది . ఈ టైటిల్ విన్నర్ మాత్రం ఇష్టం యశ్వంత్ మాస్టర్ సార్ గెలవాలి అంతే ఏం డాన్సింగ్ ఏం మైండ్ బ్లోయింగ్ ఏమైంది నీకు ఆర్నోల్డ్ అబ్బబ్బ సూపర్ సూపర్ సూపర్" అంటూ కామెంట్స్ చేశారు.

ఇక కొంతమంది ఐతే మాత్రం జిత్తు మాష్టర్ - గౌతమ్ పెర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం కృష్ణ మాష్టర్ కి టైటిల్ దక్కాలి అంటున్నారు. కానీ ఎక్కువ శాతం యష్ మాష్టర్ కి సపోర్ట్ గా నిలిచారు. గౌతమ్ డివోషనల్ పెర్ఫార్మెన్స్ కి జానీ మాష్టర్ ఫిదా ఇపోయారు. "నా పేరు నిలబెట్టావురా " అంటూ పొగిడారు. అలాగే ప్రోమో లాస్ట్ లో చూస్తే మాత్రం గౌతమ్ కి పూనకం వచ్చేసింది. టైటిల్ విన్నర్  ని అనౌన్స్ చేసే టైములో జానీ మాష్టర్ లేచి మైక్ ని పక్కకు తోసేసి... తన జాకెట్ తీసి విసిరేసి స్టేజి మీద నుంచి కిందకి సీరియస్ గా లేచి వెళ్లిపోయారు. ఇంతకు ఎం జరిగింది అన్నది మాత్రం ఎవరికీ తెలీలేదు. మరి ఈ ఢీ డబుల్ ఇంపాక్ట్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది మాత్రం మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com