Home

»

Tv News

BiggBoss 10 Telugu: శివకుమార్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Nov 21, 2026 9:15AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 5వ వారం వీకెండ్‌లో ఒకేసారి ఐదుగురు వైల్డ్ కార్డ్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో అందరి దృష్టిని లాగింది ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్, టీవీ నటుడు శివకుమార్ మరిహాల్ ఎంట్రీనే. బైక్‌పై మాస్‌గా ఎంట్రీ ఇచ్చిన శివ.. స్టేజ్‌పైనే నాగార్జున అడిగిన టార్గెట్ బోర్డులో తన టార్గెట్లు ఎవరో క్లియర్‌గా చెప్పేశాడు. షాలిని, చరణ్‌లను టార్గెట్ చేస్తానని ప్రకటించి హౌస్‌లోకి అడుగుపెట్టాడు. రోహిత్ కోసం షాలినీ వచ్చింది కానీ కప్ కోసం కాదని, చరణ్ రీ-ఎంట్రీ ఇచ్చినా గేమ్ ఆడడం లేదని శివ స్టేజ్‌పైనే కుండబద్దలు కొట్టేశాడు. శివ మాటలకు షాలిని కౌంటర్ ఇవ్వబోతే నాగార్జుననే ఆమెకు కౌంటర్ ఇవ్వడం ఆ రోజు హైలైట్ అయ్యింది.

 

ఇక హౌస్‌లోకి వెళ్లగానే శివ తన మార్క్ చూపించాడు. నరేష్, రోహిత్‌లకు నాగార్జున ఇచ్చిన బ్యాడ్జెస్‌ను ఇచ్చి వాళ్లను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు. దీనితో చివరికి షాలిని, చరణ్ మాత్రమే ఎలిమినేషన్ లిస్ట్‌లో మిగిలారు. హౌస్‌మేట్స్ ఓటింగ్‌లో షాలినికి 10 ఓట్లు, చరణ్‌కు కేవలం 1 ఓటు మాత్రమే పడడంతో చరణ్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. శివ టార్గెట్ చేసిన వాళ్లలో ఒకరు అదే రోజు ఎలిమినేట్ అవ్వడం శివ ఎంట్రీకి ఫుల్ పవర్ ఇచ్చింది. అదే రోజు అపూర్వ కూడా ఎలిమినేట్ కావడంతో డబుల్ ఎలిమినేషన్, ఐదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆ వీకెండ్ బిగ్ ట్విస్ట్‌గా మారింది.

శివకుమార్ ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్-7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ ప్రియుడు. బెళగావికి చెందిన శివ.. కన్నడ ‘నాగకన్నికె’ సీరియల్‌తో మొదలుపెట్టి తెలుగులో ‘నిన్ను కోరి’, ‘మౌన రాగం’ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ప్రియాంకతో 7-8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న శివ.. ఆమెతో కలిసి లివ్-ఇన్‌లో ఉంటున్నాడు. బిగ్ బాస్‌లోకి వచ్చే ముందు ‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి తప్పుకోవడంతోనే అతడి ఎంట్రీ కన్ఫమ్ అయ్యిందని టాక్ వచ్చింది. హౌస్‌లోకి వచ్చాక ‘సర్, మేడం’ అంటూ కూల్‌గా ఉంటూనే అదిరిపోయే కౌంటర్లతో తన మార్క్ చూపిస్తున్నాడు శివ. ఫ్యామిలీ వీక్‌లో ప్రియాంక హౌస్‌లోకి వచ్చి శివతో బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా హౌస్‌లోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అందరినీ షాక్‌కి గురి చేసింది.

అయితే శివ జర్నీ అంత సాఫీగా సాగడం లేదు. వర్షిణి అతడిపై తమ అలయెన్స్‌ను బ్రేక్ చేయడానికే వచ్చాడని ఆరోపించి నామినేట్ చేసింది. దానికి ప్రియాంక బయట నుంచి వర్షిణికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు వీక్-11 ఓటింగ్‌లో శివ 1.76% తో డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కూడా అమన్ చేతిలో ఓడిపోయాడు. మరి ప్రియాంక సపోర్ట్‌తో హౌస్‌లోకి వచ్చిన శివ.. ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడి ఫినాలే రేసులో నిలబడతాడా చూడాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com