Jayam serial : గంగ జాతకంలో తన భర్తకి ప్రాణగండం.. బాబా మాటలతో కుటుంబమంతా షాక్!
on Jan 23, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -175 లో... శకుంతలతో పాటు పెద్ద సారు, వీరు, ఇషిక, సూర్య, గంగ అందరు హాల్లో ఉంటారు. ఎందుకు మనం అంతా ఇప్పుడు ఇలా ఎదురుచూడటం ఎవరు ఈ బాబా అని శకుంతల అడుగుతుంది. ఎప్పటి నుండో మనం స్వామిని నమ్ముకున్నాం కదా కొత్తగా ఈ బాబా ఏంటని శకుంతల అడుగగా.. మంచి మహిమ గల బాబా అని మా అమ్మ చెప్పిందని గంగ అంటుంది. అదే ఎందుకు ఇప్పుడు అని అంటుంది. ఏ రాయిలో ఏ మహిమ ఉందోనని కనపడిన ప్రతీ దగ్గర మొక్కుకోవట్లేదా అని పెద్దసారు అంటాడు. అప్పుడే విభూది బాబా వస్తాడు.
మొదటగా పెద్దసారు, శకుంతల గురించి మాట్లాడతాడు బాబా. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం.. అయితే మీ మధ్య కొన్ని సమస్యలున్నాయని చెప్పగానే అవునని పెద్దసారు అంటాడు. గంగ, రుద్ర ప్రతాప్ ల గురించి చెప్పమని అడుగగా.. వారి జాతకం తీసుకురమ్మని చెప్తాడు బాబా. ఇద్దరి జాతకం ఇచ్చాక అది చూసి షాక్ అవుతాడు బాబా. గంగ జాతకంలో భర్తకి ప్రాణగండం ఉంది. వారిద్దరి మధ్య కార్యం జరిగితే గంగ భర్త ప్రాణాలకే ప్రమాదం అని బాబా చెప్తాడు. దాంతో గంగతో పాటు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నేను చెప్పానా.. నా మాట ఎవరు వినలేదు.. ఇప్పుడు చూసారా.. ఇప్పుడేమంటారంటూ పెద్దసారు మీద శకుంతల కోప్పడుతుంది.
మరి దీనికి పరిహారం లేదా బాబా అని పెద్దసారు అడుగగా.. మొదటగా గంగ, రుద్రలని కలవనీయకుండా దూరంగా ఉంచాలి.. ఆ తర్వాత మహా మృత్యుంజయ హోమం జరిపించాలి.. జపాలు, యాగాలు చేయాలి. అప్పుడే గ్రహా దోషం పోయి శాంతి కలుగుతుందని చెప్పి విభూది బాబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బాబా చెప్పిన మాటలనే తల్చుకుంటూ గంగ ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక వీరు, ఇషిక ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇక గంగ ఇంటి నుండి దూరంగా వదిలివెళ్ళిపోవాలనుకుంటుంది. రుద్ర క్షేమం కోసం బాక్సింగ్ ని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది గంగ. మరి రుద్ర తనని తీసుకొస్తాడా.. వీరు బెదిరించి బాబాతో అలా చెప్పించాడని రుద్ర, గంగ తెలుసుకుంటారా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



