బుల్లితెరపైకి వెన్నెల కిషోర్!
on Mar 21, 2023
ఎందరో హీరో హీరోయిన్లు, కమెడియన్లు బుల్లితెరపై యాంకర్లుగా మారి అలరించారు. ఇప్పుడు అదే బాటలో కమెడియన్ వెన్నెల కిషోర్ పయనించబోతున్నాడు. త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'అలా మొదలైంది' అనే షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోని నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ షోని అధికారికంగా ప్రకటించారు. "నవ్వడానికి సిద్ధంగా ఉండండి" అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
గతంలో ఈటీవీలో కమెడియన్ అలీ హోస్ట్ గా 'ఆలీతో సరదాగా' అనే టాక్ షో ప్రసారమైంది. అందులో అలీ సెలెబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి అలరించాడు. మరి ఇప్పుడు వెన్నెల కిషోర్ హోస్ట్ చేయనున్న 'అలా మొదలైంది' షో ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
