Home

»

Tv News

కుక్కలకు ఫుడ్ పెట్టినప్పుడే కాలభైరవ స్వామి కరిగిపోతాడు... ప్రిన్సి రీల్ వైరల్

Nov 21, 2026 11:51AM

బుల్లితెర మీద ప్రిన్సీ అందరికీ సుపరిచితమే. ఆమె ఇటు తెలుగు అటు కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది. కుంకుమ పువ్వు, రోజా, మల్లి వంటి సీరియల్స్ లో నటించింది. అలాగే ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రిన్సి రీసెంట్ గా శివ మాల వేసుకుంది. అలాగే ఒక ఇంటరెస్టింగ్ రీల్ చేసి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రీల్ శివయ్య మీద అలాగే కాలభైరవ స్వామి మీద చేసింది. ఇంతకు ప్రిన్సి ఆ రీల్ లో ఎం చెప్పింది అంటే ..." ఓం నమశ్శివాయ! ఒక చెంబు నీళ్లు పోసి కన్నీళ్లు పెట్టుకుంటే మా శివయ్య కరిగిపోతాడు. కానీ మా శివయ్య అవతారమైన కాలభైరవ అవతారం కరగాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అది చాలదు. ఎందుకంటే కాలభైరవ అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం కరగాలంటే మీరు కుక్కతో బాగుండాలి. చాలామంది కాలభైరవ స్వామికి  పూజ చేస్తారు, వ్రతం చేస్తారు అన్నీ చేస్తారు, గుడికి వెళ్తారు. కానీ కుక్కలపై  రాయి వేసి  కొడతారు. కుక్కల్ని కర్రతో కొడతారు. కుక్కలు మీ దగ్గరికి వచ్చేది ఒక పూట ఫుడ్ కోసమే కదా. అవి వేరే ఏమాశిస్తాయి? మీ దగ్గర ఆస్తులు ఆశిస్తాయా, బంగారం ఆశిస్తాయా , ఏమాశిస్తాయి? వాటికి పొట్టనిండా ఫుడ్ కావాలి. దానికోసమే కదా మీ దగ్గరికి వస్తాయి. ఫుడ్ ఇవ్వకుండా మీరు కర్రతో కొడితే అవి కరవవా? మన మీద ఎవరైనా కర్రతో కొట్టినా రాయి వేసినా  మనమే రియాక్ట్ అవుతాం, మనమే గొడవలకు వెళ్తాం. అలాంటిది పాపం వాటికి నోరులేని ప్రాణం అది. అవి కూడా రాయితో కొట్టినప్పుడు, కర్రతో కొట్టినప్పుడు వాటికి కూడా నొప్పేస్తుంది. సో అవి కూడా కరవడానికి వస్తాయి కదా సహజంగానే.  సో కుక్కతో మీరు ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో ఫుడ్ పెట్టండి అవి కరవవు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను కుక్కల దగ్గరికి వెళ్తాను. కుక్కలకి ఫుడ్ పెడతాను. కానీ ఎప్పుడూ నన్ను కరవలేదే. కుక్కల్లో  కొన్ని పిచ్చి కుక్కలు కూడా ఉంటాయి. పిచ్చి పట్టినప్పుడు పిచ్చి కుక్కలు కరుస్తాయి. నేను కాదని చెప్పను. ఇప్పుడు మనుషుల్లో కూడా చాలా మంది మంచోళ్ళున్నారు, చెడ్డోళ్ళున్నారు. అంతే కదా. ఇప్పుడు మనకి పిచ్చి పట్టినప్పుడు మనం కూడా ఎలా బిహేవ్ చేస్తామో మనకి కూడా తెలీదు. సేమ్  కుక్కల్లో కూడా అలాగే ఉంటుంది . సో ఏదో ఒక పిచ్చి కుక్క కరిసిందని చెప్పేసి అన్ని కుక్కల్ని జడ్జ్  చేయకండి. మీరు ఒక్క కుక్క కరిస్తే  అన్ని కుక్కల్ని ఒకేలా చూస్తారు. కానీ కుక్కలు మాత్రం అలా కాదు. ఎవరైనా  ఒక్కరు బిస్కెట్ వేస్తే అందరు మనుషులు మంచోళ్ళని నమ్ముతాయి. సో ఈ వీడియో చూస్తే కొంతమందికి నా మీద కోపం రావొచ్చు. ఎందుకంటే కుక్కలంటే  నచ్చని జనాలు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాలభైరవ స్వామి ప్రసన్నం కావాలి అంటే కుక్కలకు ఫుడ్ పెట్టడం వాటిని ప్రేమతో చూడడం అలవాటు చేసుకోండి " అంటూ ఆ దైవం గురించి కొన్ని గొప్ప విషయాలను చెప్పుకొచ్చింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com