Home

»

Tv News

Bigg Boss 10 Telugu : నరేశ్ గంజినీళ్ళు తాగేది చూసి ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్!

Nov 21, 2026 11:47AM

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక రోహిత్ చాలా ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు. ఇక హౌస్ లో ఎలా ఉండేది అన్న విషయాలను కూడా బయట పెడుతున్నాడు. అలా ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను కూడా చెప్పుకొచ్చాడు.

"బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ప్రెస్‌మీట్ ఎప్పుడు పెడతారని అడిగారు. అందుకే కొంత గ్యాప్ తీసుకున్నాను. బిగ్‌బాస్ నుంచి మళ్లీ పిలుస్తారేమోనని చిన్న ఆశ ఉండేది. ప్రేక్షకుల నుంచి ప్రేమ, మద్దతు రావడంతో మరోసారి హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నేను 10 కేజీల బరువు తగ్గిపోయాను. అక్కడ ఆహారం పెట్టరని కాదు.. కానీ పరిమితంగానే ఆహారం ఇస్తారు. ఆ విధానం అలాగే ఉంటుంది. దానికి తోడు గేమ్ వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంటుంది " అని రోహిత్ నాయుడు చెప్పాడు.

రోహిత్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ ఆసక్తికరంగా స్పందించారు. "త్రిగుణ్ అయితే రోహిత్ ఫుడ్ ని , కూరలను కూడా వేరే వాళ్లకు  ఇచ్చేసేవాడు. రేషన్ మేనేజర్‌గా ఉన్న సమయంలో ఆహారం విషయంలో రోహిత్‌ను మాత్రమే టార్గెట్ చేసేవాడు. కామనర్ అయిన రోహిత్ ఎక్కడ విన్నర్  అవుతాడోననే భయంతో పరిమిత ఆహారం విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవాడు. అందరి విషయంలో ఇలా చేయకుండా కేవలం రోహిత్ విషయంలోనే అలా ప్రవర్తించేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. త్రిగుణ్‌కు రోహిత్ అంటేనే పడేది కాదు. రోహిత్ విన్నర్  అవుతాడనే భయంతోనే అతని ఫుడ్ ని మిగతావాళ్లకు  ఇచ్చేసేవాడు. అలాగే అతని డ్రెస్సులను  కూడా కింద పడేసేవాడు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com