Home

»

Tv News

ఢీ షో కళ తప్పింది... ఇంతకుముందులా లేదు... అందుకే నేను తిరిగి కొరియోగ్రాఫర్ గా రాను

Nov 21, 2026 11:57AM

బుల్లితెర మీద కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ గురించి తెలియని వారు లేరు. ఫేమస్ ఢీ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే జానీ మాష్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని క్లాషెస్ రావడం కేసులు కోర్టులు అంటూ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. జానీ మాష్టర్, శ్రష్టి వర్మ  కౌంటర్లు రివర్స్ కౌంటర్లు వేసుకున్నారు. అలాగే ఈమె అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీలో సూసేకి అగ్గిపుల్ల అనే సాంగ్ కి కోరియోగ్రఫీ చేసింది. అలాగే రంగస్థలం, జైలర్, గేమ్ చెంజర్, వంటి మూవీస్ లో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేసింది. అలాగే బిగ్  బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా వెళ్ళింది. సోషల్ మీడియా ఈమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ప్రశ్నలు అడగండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టింది. అందులో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చింది."నెక్స్ట్ మూవీ అప్ డేట్ మేడం " అనేసరికి "సూపర్ సూన్ " అని చెప్పింది.

తర్వాత "ఢీ షోకి మళ్ళీ కొరియోగ్రాఫర్ గా తిరిగి వస్తారా " అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది. " దురదృష్టవశాత్తూ, ఇకపై నేను ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా కనిపించను.  నిజం చెప్పాలంటే, ఒకప్పుడు ఢీ  ఎంతో అద్భుతమైన వేదిక అన్న విషయం అందరికీ తెలుసు.  ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పించి, ఎన్నో మంచి జ్ఞాపకాలను అందించింది ఈ షో . కానీ రానురాను ఆ షో కళ  తప్పింది. ఆ షోకి ఉన్న  ఆకర్షణ తగ్గిపోయినట్లు  నాకు అనిపిస్తోంది. అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఢీకి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు కనిపించడం లేదు. వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఢీ షో గతంలో ఉన్నట్టుగా అనిపించడం లేదు. అందుకే ప్రస్తుతానికి ఆ షోలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను." అని చెప్పింది శ్రష్టి వర్మ .

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com