Home

»

Tv News

దిష్టి పెట్టకండి ప్లీజ్ ... మాది అపురూప స్నేహ బంధం

Nov 17, 2026 9:01AM

బుల్లితెర మీద ప్రియాంక జైన్ మౌనరాగం అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో నటించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచింది. అలాంటి ప్రియాంక  జైన్ ఇప్పుడు సీరియల్స్ lo పెద్దగా కనిపించడం లేదు. కానీ సీరియల్స్ నుంచి తప్పుకుని మూవీస్ లో ఓటిటి సిరీస్ ల్లో కనిపిస్తోంది. రీసెంట్ గా వరుణ్ సందేశ్ నటించిన నయనం అనే సిరీస్ లో నటించి  విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదొక థిల్లర్ సిరీస్.  అందులో ఆమె నటన మాములుగా ఉండదు. అలాగే ప్రియాంక జైన్ రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ పేజీలో టేస్టీ తేజ, అవినాష్ తో కలిసి కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే ఒక కోట్ కూడా పెట్టుకుంది. "చాలా రోజుల తర్వాత మేము కలిసాం. ఈ గందరగోళ ప్రపంచంలో నా చిరునవ్వుకు కారణం వీళ్ళే . ఎప్పటికీ ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలి.మా సంతోషానికి ఎవరి దిష్టి తగలకూడదు" అంటూ పోస్ట్ చేసుకుంది.

ఇక నెటిజన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. "బ్యూటిఫుల్ ట్రియో . ఎంత ముద్దుగా ఉన్నవో పరి క్యూటీ ... ఎవరు  పిక్స్  పెట్టమన్నారు  , మళ్ళీ  దిష్టి అంట.. ప్రతీ పోస్ట్ కి  సేమ్ డైలాగ్ నా చూడకూడదు అనుకున్నా ఏదో విధంగా వస్తున్నాయి పోస్టులు... అక్కడ ఇద్దరు అందగాళ్ళు ఉండగా నీకు దిష్టి పెడతారా చెప్పు..త్రి ఫ్రెండ్స్... చాలా బాగున్నారు " అంటూ సరదాగా సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లేటెస్ట్  బిగ్ బాస్ సీజన్ కి ప్రియాంక జైన్ సహచరుడు శివ్ కుమార్ వెళ్లి అక్కడ టాస్కులు ఆడుతున్నాడు. ఇక ప్రియాంక ఐతే బయట నుంచి తనకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టి ఎంకరేజ్ చేస్తోంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com