Home

»

Tv News

సుమను ఆటపట్టించిన జగపతిబాబు.. రాజీవ్ కనకాలపై సెటైర్లు..

Nov 16, 2026 5:05PM


జయమ్ము నిశ్చయమ్మురా షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి షోలోకి ప్రముఖ యాంకర్ సుమ అతిథిగా వచ్చారు. సుమ ఎంట్రీతోనే షోలో సందడి మొదలైంది. జగపతిబాబు తనదైన కామెడీతో సుమను ఆటపట్టించగా, ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్లు ఇచ్చారు. ఆ తర్వాత నటుడు రాజీవ్ కనకాల ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత సరదాగా మారిపోయింది. ఈ ఇద్దరినీ కలిపి జగపతిబాబు చేసిన కామెడీ ప్రేక్షకులను నవ్విస్తోంది.

ముందుగా సుమను ఉద్దేశించి జగపతిబాబు.. "నీ పూర్తి పేరు చెప్తావా ఒకసారి" అని అడిగారు. "పల్లెశన పాచువీటు సుమ అన్న పేరుతో పుట్టినటువంటి నేను" అని సుమా అనేలోపు జగపతిబాబు మధ్యలో కల్పించుకుని "నేను పేరు మాత్రమే అడిగాను.. బూతులు అడగలేదు" అంటూ పంచ్ వేశారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.

ఆ తర్వాత సుమ లిటిల్ హార్ట్స్ సినిమా గురించి ప్రస్తావించారు. "ఆ సినిమాలో వాళ్ల నాన్న ఎవడు చూస్తాడు అని అంటాడు కదా.. రాజీవ్ వచ్చి చూశాడు అది" అంటూ సరదాగా కామెంట్ చేశారు. దీనికి జగపతిబాబు స్పందిస్తూ.. "నాకు తెలిసి రాజీవ్ చెప్పింది చాలా రొమాంటిక్ పర్సన్ అని" అన్నారు. ఆ మాట వినగానే సుమ సిగ్గుపడుతూ తలదించుకున్నారు. వెంటనే జగపతిబాబు "అబ్బా.. సిగ్గేసింది" అంటూ మళ్లీ ఆటపట్టించడంతో సుమ కూడా నవ్వేశారు.

ఇక తన పెళ్లి గురించి సుమ మాట్లాడుతూ.. "నేను ఇద్దర్ని, ముగ్గుర్ని, నలుగుర్ని రిజెక్ట్ చేశా" అని చెప్పారు. వెంటనే జగపతిబాబు "అయితే రాజీవ్‌కి ఒక్కటే తెలుసు" అంటూ మరో పంచ్ వేశారు. ఇంతలో షోలోకి రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చారు. ఆయనను చూడగానే సుమ తనదైన శైలిలో కామెడీ మొదలుపెట్టారు. "కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటావా? ఓ ... సారీ.. ఇది డ్రై ఫ్లవర్స్" అంటూ రాజీవ్‌పై సెటైర్ వేశారు. దీనికి రాజీవ్ కూడా తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "ఈమెను చూసి ఆహా.. ఏమి సౌందర్యరాశి... ఈమెకు కదా నేను  లైన్ వేయాలి అనుకున్నా.. ఈలోపల ఒకడు తయారయ్యాడు" అంటూ తనదైన స్టైల్లో చెప్పారు. వెంటనే సుమ "ఎన్నని గుర్తుపెట్టుకుంటావ్ రాజా?" అని కౌంటర్ ఇచ్చారు. దానికి రాజీవ్ "ఓరే నాయనో" అంటూ సరదాగా స్పందించారు.

అంతటితో ఆగని సుమ.. బాటిల్‌లో ఉన్న నీళ్లను రాజీవ్ తలపై పోసి "వద్దు.. చెప్పకు" అంటూ ఆయనను వారించారు. ఇదంతా చూస్తున్న జగపతిబాబు "ఇప్పుడు మండిందా బాగా?" అంటూ మరో పంచ్ వేశారు. దానికి రాజీవ్ "అలా అడగకూడదు సర్" అని అనగానే  సుమ వెంటనే "నీ తలకాయ్.. సిగ్గుందా నీకసలు?" అంటూ కౌంటర్ ఇచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com