Home

»

Tv News

పండు మాస్టర్ ఇలా నడుస్తుంటే చాలా స్టైల్ గా ఉంది... ట్రెండ్ సెట్టర్...

Nov 17, 2026 9:06AM

ఢీ షోలో పండు మాష్టర్ ఉంటే ఆ ఎనెర్జీనే వేరు. ఎందుకంటే నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, మంచి డాన్స్ చేస్తాడు, రోస్ట్ చేస్తాడు ఒక్కటేమిటి పండు అన్ని రకాలుగా ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాంటి పండుకు జూన్ లో ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దాంతో ఒక కాలికి సర్జరీ అయ్యే పరిస్థితి తలెత్తింది. అలా జూన్ నుంచి ఇప్పటి వరకు బెడ్ రెస్ట్ లో ఉన్న పండు రీసెంట్ గా ఒక రీల్ ని రిలీజ్ చేసాడు. ఆ రీల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
ఒక కార్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న తన హ్యాండ్ స్టిక్ తీసి స్టైల్ గా అలా నడుచుకుంటూ వెళ్లే రీల్ చూసి ఫాన్స్ అంతా ఖుషీ ఐపోతున్నారు. ఈ రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక ఫాన్స్ నెటిజన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ని పండు మాష్టర్ తన స్టేటస్ లో కూడా పోస్ట్ చేసుకున్నాడు.

అన్షు రెడ్డి ఐతే "ఇలా చూడడం సంతోషంగా ఉంది " అని కామెంట్ చేసింది. అర్జున్ కళ్యాణ్ ఐతే "వెల్కమ్ బ్యాక్ టైగర్ " అని చెప్పాడు. ఇక టేస్టీ తేజా ఐతే "రీఎంట్రీ కోసం వెయిటింగ్ మాష్టర్ " అన్నాడు. తాగుబోతు రమేష్ ఐతే ఎమోజిస్ తో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక మిగతా నెటిజన్స్ అంతా కూడా "ఇంత ఫాస్ట్  రికవరీ . దేవుడు ఉన్నాడు  షో  లోకి  త్వరగా రావాలి... పండు మాస్టర్ ఇలా నడుస్తుంటే కూడా చాలా స్టైల్ గా ఉంది ట్రెండ్ సెట్టర్... మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది పండు బ్రో ... మళ్ళీ తిరిగి వచ్చిన మా సాలార్. మాస్టర్ మీరు సరదాగా వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడితే చాలు మాస్టర్.. ఎప్పుడో మీ డాన్స్ మా గుండెల్లో నిలిచిపోయింది మాస్టర్. మైకు పట్టుకుని మాట్లాడితే చాలు మాకు ఏమీ వద్దు... " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పండు ఢీ షోలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అన్నదే ఇప్పుడు సస్పెన్సు.
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com