Home

»

Tv News

గణేష్ మాస్టర్, రష్మి చేసిన సాయం నిజమే.. టీఆర్పీ స్టంట్ కాదు.. డీ షో కొరియోగ్రాఫర్ సాయి ఎమోషనల్

Nov 17, 2026 9:33AM

డీ షో కొరియోగ్రాఫర్ సాయి  తన జీవితంలో జరిగిన ఓ ఇష్యూ  గురించి రీసెంట్ గా కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు . బయట ఎక్కడ కనిపించినా చాలామంది  ఒకటే అడుగుతూ ఉంటారని అదే " గణేష్ మాస్టర్ నిజంగానే రూ.4 లక్షలు నిజంగా ఇచ్చారా? రష్మి కూడా ఆర్థిక సాయం చేశారా? అదంతా టీఆర్పీ కోసం చేసిన స్టంటా? అని అడుగుతుంటారని చెప్పారు. అయితే అదంతా నిజమేనని, గణేష్ మాస్టర్, రష్మి తనకు నిజంగానే ఆర్థిక సాయం చేశారని స్పష్టం చేశారు. డీ షో మొదటి సీజన్‌లో సాయి డెబ్యూ కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టారు. మొదటి నుంచి మంచి ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఓసారి సాయి, సోమేష్ కలిసి చేసిన పర్ఫార్మెన్స్ కూడా బాగా హిట్ అయింది. ఆ టైములో  ప్రదీప్ హోస్ట్‌గా, సుధీర్ బాయ్స్  టీమ్‌కు, రష్మి గర్ల్స్  టీమ్‌కు మెంటార్స్ గా ఉండేవాళ్ళు.  గణేష్ మాస్టర్, ప్రియమణి, షణ్ముఖి జడ్జెస్ గా  ఉన్నారు.

ఆ పెర్ఫార్మెన్స్ ఐపోయాక  సాయి కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన అతని స్నేహితుడు, కంటెస్టెంట్ సాయి మైక్ తీసుకుని స్టేజ్‌పైనే తన  ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకొచ్చాడు . ఆ టైములో  గణేష్ మాస్టర్ సాయిని ఎంత అప్పు ఉందొ అడిగి తెలుసుకుని  నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉందని  చెప్పడంతో, షో ఐపోయాక  వచ్చి డబ్బులు తీసుకెళ్లమని చెప్పారు.
అక్కడే ఉన్న  రష్మి కూడా సాయికి  లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. మరోవైపు గణేష్ మాస్టర్ నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా రూ.50 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయలు పంపించారు. ఇలా రష్మి నుంచి లక్ష, గణేష్ మాస్టర్ నుంచి రెండు లక్షలు కలిపి సాయికి మొత్తం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది. ఇదంతా టీఆర్పీ కోసం చేసిన డ్రామా కాదని, ఇద్దరూ నిజంగానే తనకు సాయం చేశారని సాయి చెప్పుకొచ్చాడు. అలాగే తనకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్ మణికంఠకు కృతజ్ఞతలు చెప్పాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com