Home

»

Tv News

ప్లాన్ చేయలేదు.. అంతా ఆ శివుడి దయే.. పాగల్ పవిత్ర ఇంటరెస్టింగ్ పోస్ట్ వైరల్

Nov 17, 2026 9:37AM

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాగల్ పవిత్ర ప్రస్తుతం బుల్లితెరపై బిజీ లేడీ  కమెడియన్‌గా దూసుకుపోతోంది.  టిక్‌టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. జబర్దస్త్ ద్వారా మరింత పాపులర్ అయింది. తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్ ని నవ్విస్తోంది . జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్  వంటి షోస్ లో  సందడి చేస్తోంది. సీరియల్స్, సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.
అలాంటి పవిత్ర రీసెంట్ గా  పవిత్ర అరుణాచలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేశానని చెప్పుకొచ్చింది.

అసలు తాను ఎలాంటి సందర్భంలో గిరి ప్రదక్షిణ చేసిందో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని పెట్టింది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో. " కొన్ని ప్రయాణాలు కేవలం ప్రయాణాలు కావు… అవి మనసుకు దొరికే ప్రశాంతత, ఆత్మకు కలిగే ఆనందం.  
నిజం చెప్పాలంటే, అరుణాచలం వెళ్లే ముందు నాకు చాలా ఫీవర్ వచ్చింది. అసలు ఈ పరిస్థితిలో ప్రయాణం చేయగలనా? గిరి ప్రదక్షిణ చేయగలనా? లేదా? అని నాకే నాపై చాలా సందేహం ఉండేది. కానీ ఒక్కసారి అరుణాచలం చేరుకున్నాక… ఎలా మొదలుపెట్టానో, ఎలా పూర్తిచేశానో కూడా తెలియనంతగా ఆ గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన అనుభూతిగా మారిపోయింది. చివరికి అరుణాచలేశ్వర స్వామివారి అద్భుతమైన దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. ఆ క్షణంలో మనసు నిండిపోయింది.   కొన్ని విషయాలు మనం ప్లాన్ చేసుకుంటాం… కానీ కొన్ని అనుభూతులు మాత్రం ఆ దేవుడి దయ వల్లే జరుగుతాయని అనిపించింది. అంతా ఆ పరమశివుని కృపే!   ఓం అరుణాచలేశ్వరాయ నమః!   హర హర మహాదేవ్! " అని ఆ శివయ్య మీద ఉన్న అపార భక్తితత్వాన్ని తన మాటల్లో ఇలా బయటపెట్టింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com