Home

»

Tv News

BiggBoss 10 Telugu:నామినేషన్స్‌లో షాలినీ వర్సెస్ నీతూ.. త్రిగుణ్ కి డాగర్‌ ఇచ్చిందిగా!

Nov 17, 2026 9:29AM

బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారంలో నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మాజీ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేశారు. ఈ క్రమంలో షాలినీ, దక్షి వచ్చి నీతూని.. మిథిలేష్ ముఖేష్‌ని.. దేబ్జానీని ఝాన్సీ, వర్షిణిని అపూర్వ నామినేట్ చేసింది. అయితే మరో వైపు వీరు ఇచ్చిన డ్యాగర్స్‌తో త్రిగుణ్ ఏమో.. శివ్‌ని, వంశీని నామినేట్ చేస్తాడు.  రామ్ ప్రసాద్‌ని శివ్, ముఖేష్ ఏమో సుధీర్‌ని నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్స్‌లో వర్షిణి మాట్లాడిన బీ, పీ మాటల్ని అపూర్వ.. నీతూ తన తమ్ముడు అంటూ రోహిత్ చేసిన వాటిని షాలినీ ఎక్స్‌పోజ్ చేశారు.

ఇక హౌస్ లోకి వచ్చిన ప్రతీ ఫ్యామిలీ త్రిగుణ్‌కి పదమూడు స్టార్లు ఇచ్చారంటూ నీతూతో సుధీర్ అంటాడు. అలాగే అమన్‌తో వర్షిణి మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ గురించి బిగ్ బాస్ చెప్తాడు. హౌస్ లోకి ఎక్స్‌ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తారని బిగ్ బాస్ చెప్పడంతో అందరు ఎక్సైట్ గా ఎదురుచూశారు. మొదటగా షాలినీ ఎంట్రీ ఇచ్చి నీతూని నామినేట్ చేసింది. ఏడ్చే నీతూ.. పిరికి నీతూ.. అరిచే నీతూ అని కామెంట్ చేసింది. వంట బాగా చేశాడు కాబట్టి కెప్టెన్‌ని చేస్తారా? నామినేషన్స్ అంటే భయపడతారని అంటుంది షాలినీ. వంశీని కెప్టెన్ చేయాలని, అతనికే సపోర్ట్ చేయాలని అనుకున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తా.. నేను నామినేషన్స్‌కి భయపడనని నీతూ అంటుంది. బయట వాళ్లని గెల్చుకోలేదు.. ఇంట్లో వాళ్లని గెల్చుకోలేదు.. అందుకే బయటకు వెళ్లావ్.. అలాంటి నువ్వు.. నన్ను నామినేట్ చేస్తున్నావా అని నీతూ ఫైర్ అవుతుంది.

నీలా డాక్యుమెంట్లు చేసుకుని రాలేదు.. ఫేక్ బాండింగ్స్ పెట్టుకోలేదని నీతూ అంటుంది. అందుకే డాక్యుమెంట్ వాళ్లతోనే స్నేహం చేశావా? నీ పవర్ నీకు ఎలా వాడుకోవాలో తెలీక.. రోహిత్‌ను అడుగుతావా? రోహిత్‌కి మాత్రం ఆట గురించి చెప్తావా? అమ్మాయి అబ్బాయి అక్కడ ఉంటే.. ఇద్దరి తప్పు ఉంటే.. ఒక్కరికి మాత్రమే ఎందుకు చెప్తున్నావని షాలిని అడుగుతుంది. రోహిత్ వాళ్ల ఇంట్లో వాళ్లే ఫోన్ చేసి నాకు చెప్పారు.. మీ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పలేదంటూ 

నీతూ అంటుంది. ఆ తర్వాత నీతూ బోర్డ్ పై షాలిని డాగర్ ని గుచ్చి నామినేషన్ చేస్తుంది. ఆ తర్వాత త్రిగుణ్‌కి షాలినీ డాగర్ ఇస్తుంది. దాంతో శివ్‌ని నామినేట్ చేస్తాడు త్రిగుణ్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com