.webp)
బుల్లితెర మీద ఏ షో చూసిన హోస్ట్ గా శ్రీముఖినే కనిపిస్తుంది. ఎక్కువగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తూ ఉంది. రీసెంట్ గా "మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" రియాలిటీ షోకి హోస్ట్ గా చేసింది. అవకాశం వస్తే అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తోంది శ్రీముఖి. అదుర్స్, పటాస్, నేను శైలజ, మేస్ట్రో , భోళా శంకర్ వంటి మూవీస్ లో నటించింది. అలాగే "మా ఇంటి బంగారం" అనే మూవీలో కూడా నటించింది. సమంత నటించిన ఈ మూవీలో శ్రీముఖి కూడా కనిపించబోతోంది. ఈ మూవీ త్వరలో వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది . ఇక శ్రీముఖి రీసెంట్ గా కామాఖ్యా టెంపుల్ కి వెళ్ళొచ్చింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖికి కొంచెం దైవ భక్తి కూడా ఎక్కువే. షూటింగ్స్ లో గ్యాప్ దొరికితే అలా టెంపుల్స్ కి వెళ్లి వస్తూ ఆ పిక్స్ ని వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ అవినాష్ తో కలిసి కామాఖ్యా టెంపుల్ కి వెళ్ళింది. సంప్రదాయ రీతిలో ముస్తాబై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసింది.
"జై మా కామాఖ్యా" అంటూ ఒక టాగ్ లైన్ కూడా పెట్టుకుంది. ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ ఫిదా ఐపోతున్నారు. "కామాఖ్యా టెంపుల్ కి వెళ్తే పెళ్లి కానీ వారికి పెళ్లి అవుతుంది అంట. సో శ్రీముఖికి తొందర్లో పెళ్లి అవుతుంది అని అనిపిస్తుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




.webp)
