Home

»

Tv News

Jayam serial : సుధా నిజం తెలిసి షాకైన శకుంతల.. బాక్సింగ్ రింగ్‌లోకి రుద్ర ఎంట్రీ!

May 26, 2026 10:12AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -278 లో.. సుధా గురించి శకుంతలకి తెలియగానే ఇంట్లో అందరిపై శకుంతల కోప్పడుతుంది. ఇంట్లో అందరు నేను చెప్పినట్టు వింటున్నారు అనుకున్నాను కానీ నన్ను మోసం చేస్తున్నారనుకోలేదని శకుంతల కోప్పడి వెళ్తుంది. తన వెనకాలే ప్రీతి వెళ్తుంటే.. వద్దు తనని ఒంటరిగా వదిలేయ్ మని పెద్దసారు అంటాడు.  ఆ తర్వాత ఏంటి బ్రో ఇలా జరిగింది.. ఇన్నిరోజులు నీపై అత్తయ్య నమ్మకం పెట్టుకుంది.. అది ఈ రోజుతో పోయిందని వీరుతో ఇషిక అంటుంది.

మరొకవైపు గంగ, రుద్ర జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అత్తయ్యకి వీరుపై కోపంగా ఉంది. ఇంకా కోపం పెంచి అతన్ని అత్తయ్యకి దూరం చేయాలని గంగ అంటుంది. ఇప్పుడు వీరు ఆలోచించేది దాని గురించి కాదేమోనని రుద్ర అంటాడు. మరోవైపు ఇషిక, వీరు ఇద్దరే మాట్లాడుకుంటారు. నేను ఆలోచించేది జరిగింది దాని గురించి కాదు.. విశ్వనాథ్ కూతురు అసలు ఎక్కడ ఉండి ఉంటుంది.. తను తప్పిపోవడానికి వెనకాల ఏదో కుట్ర ఉందని అనిపిస్తుంది.. ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలని ఇషికతో వీరు అంటాడు. ఆ తర్వాత ఆ విశ్వ నాథ్ గారి అమ్మాయిని వీరు కంటే ముందు మనం కనిపెట్టాలని గంగ, రుద్ర అనుకుంటారు.  విశ్వనాథ్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి తన కూతురు చిన్నప్పటి ఫోటో చూపించి ఇప్పుడు ఈ పాప ఎలా ఉంటుందో స్కెచ్ గియ్యమని చెప్తాడు. అందుకు అతను ఒప్పుకుంటాడు. రెండు రోజుల్లో గీసి ఇస్తానని అతను అంటాడు.

మరొకవైపు త్వరలో బాక్సింగ్ పోటీ జరుగుతుందని పేపర్ లో చూసి రుద్రకి రంగా చెప్తాడు. ఇక నువ్వు పూర్తిగా బాక్సింగ్ పై శ్రద్ధ పెట్టాలి.. అందుకు కావల్సిన ఫుడ్ ని తీసుకొని వద్దాం పదా అని రుద్ర అంటాడు. రుద్ర, గంగ, రంగా ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్ కీ వెళ్లి తనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ కోసం చూస్తారు. అక్కడ ప్రమీల విషయంలో కార్తీక్ చూపిస్తున్న ఇంట్రస్ట్ గురించి గంగతో మక్కం చెప్తాడు. అది విని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రకి చెప్పాలని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com