Home

»

Tv News

నేనే నా అర్ధాంగి ప్రశ్నకు నవదీప్ అదిరిపోయే రిప్లై!

May 25, 2026 3:07PM

నవదీప్ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సిల్వర్ స్క్రీన్ మీద తనకంటూ ప్రూవ్ చేసుకున్నాడు. చాలామూవీస్ లో మర్చిపోలేని రోల్స్ లో నటించాడు. ఇక స్మాల్ స్క్రీన్ మీద బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జ్ గా వచ్చి తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు. ఇక నవదీప్ ఇప్పుడు మాస్ జాతర కామెడీ షోకి జడ్జ్ గా ఉన్నాడు. ఇక రకరకాల ప్లేసెస్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఒక బైక్ వేసుకుని ఒక బ్రిడ్జి మీద రైడ్ చేసి ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. దానికి మాములుగా రాలేదు కామెంట్స్ .

ఇంతకు ఆ బ్రిడ్జి గురించి చెప్పాలంటే నేపాల్‌లోని పర్బత్ , బగ్లుంగ్ జిల్లాల్లో  ఉన్న కుష్మా సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రాంతం ప్రత్యేకంగా గండకి గోల్డెన్ బ్రిడ్జ్ లేదా  కుష్మా-బలేవా బ్రిడ్జ్  అని పిలుస్తారు. ఈ బ్రిడ్జి మీద నవదీప్ చేసిన రైడ్ చూసిన ఒక నెటిజన్ "ఇండియన్ టామ్ క్రూజ్" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా జిమ్ చేస్తూ ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియోని పోస్ట్ చేసాడు. దానికి ఒక కొంటె కామెంట్ కూడా వచ్చింది.

దాన్ని కూడా నవదీప్ పోస్ట్ చేసాడు. "మీరు ఇంత మంచిగా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. మీ వైఫ్ ఉంటేనే కదా ఆ బాడీకి అర్ధం. తిట్టుకోకండి" అనే సరికి నవదీప్ కూడా ఇంకా కొంటె రిప్లై పెట్టాడు. "నేనే నా అర్ధాంగి" అన్నాడు. ఇక నవదీప్ నటించిన దండోరా, న్యూసెన్స్ మోవీస్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com