Home

»

Tv News

Bigg Boss 10 Telugu: శ్వేత నాయుడు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nov 16, 2026 8:31AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ట్విస్టులు, టర్న్‌లతో సాగుతోంది. ఈ క్రమంలో పదోవారం ఎండింగ్ సెలబ్రేషన్ మూడ్‌లో సాగింది. దాదాపు మూడు గంటలపాటు ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. కంటెస్టెంట్లకి సపోర్ట్ చేయడానికి సెలెబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. పదోవారం ఊహించినట్టుగానే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యింది. శ్వేత నాయుడు డ్యాన్సర్. పలు డ్యాన్సు షోస్‌లో మెప్పించింది. సెలబ్రిటీ హోదాలోనే హౌజ్‌లోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారంలో ఆమె ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఐదు వారాలు ఉండటమే ఎక్కువ అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎందుకంటే శ్వేత నాయుడు కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. హౌజ్‌లో సైలెంట్‌గా ఉంటోంది.

మరి శ్వేత నాయుడు పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకి వారానికి రూ.1.50 లక్షలు పారితోషికం నిర్ణయించారట. ఐదు వారాలు ఉండటంతో రూ.7.50 లక్షలు రెమ్యూనరేషన్ రూపంలో అందుకుందంట. టాక్స్‌లు పోను ఏడు లక్షల వరకు ఆమెకి పారితోషికం అందుతుందని చెప్పొచ్చు. జస్ట్ ఐదు వారాలకు ఏడు లక్షలు అంటే మామూలు విషయం కాదు. సైలెంట్‌గా ఉన్నా గట్టిగానే కొట్టింది శ్వేత నాయుడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా ముగ్గురు రామకృష్ణ, శివ్ కుమార్, నీతూ నటరాజ్ ఉన్నారు.

పదోవారం వరకు ఉన్న లేడి కంటెస్టెంట్స్ లలో శ్వేత గేమ్స్ లో టాప్.. బాగా పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే తనకి ఉన్న ఏకైక మైనస్ అలయన్స్. ఎవరి సపోర్ట్ లేకపోవడం..ఇండివిడ్యువల్ గా ఆడటం వల్లే తను ఎలిమినేషన్ అయింది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com