Home

»

Tv News

Bigg Boss 10 Telugu: పదకొండో వారం డాగర్స్ నామినేషన్స్.. అపూర్వ, ఝాన్సీ డాగర్లు ఎవరికంటే!

Nov 16, 2026 8:28AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పదకొండవ వారం నామినేషన్స్ అదిరిపోయేలా సాగాయి. ఈసారి నామినేషన్స్‌ను డిక్టేటర్లుగా వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్లు నడిపించారు. అపూర్వ, షాలినీ, రోహిత్‌ల రాకతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

లీక్స్ ప్రకారం నామినేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. వర్షిణిని అపూర్వ నామినేట్ చేసింది. అపూర్వ రెండో డాగర్ ని శివకు ఇచ్చింది. దాంతో రామ్ ప్రసాద్ ని శివ్  నామినేట్ చేశాడు. దేబ్జానీని ఝాన్సి నామినేట్ ఝాన్సీ చేసింది. ఆ తర్వాత ఝాన్సీ తన రెండో డాగర్ ని ముకేష్‌కు ఇవ్వగా అతను త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు.

దీంతో హౌస్‌లో మళ్లీ ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ బిగ్ ఫైట్ మొదలైంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరోసారి హీట్ పెంచింది. ఈ వారం జరిగే పూర్తి ఎపిసోడ్‌లో అపూర్వ, షాలినీ, రోహిత్‌ల రాకతో సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి మరి. నామినేషన్ వాదన బలంగా ఉందా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com