Home

»

Tv News

BiggBoss 10 Telugu: బిగ్ బాస్ సీజన్-10 విన్నర్ త్రిగుణ్.. రన్నర్ ముఖేష్.. ఫ్యామిలీస్ చెప్పిందిదే!

Nov 16, 2026 8:34AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో నిన్నటితో పదో వారం పూర్తయింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్ల కోసం సెలెబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్లు స్టేజ్ మీదకు వచ్చారు. వాళ్లు ఇచ్చిన హింట్లను చూస్తే టాప్-2లో త్రిగుణ్, ముఖేష్ ఉన్నారని తెలుస్తోంది.

మొదటగా వంశీ కోసం హరిణి, అలీ వస్తారు. వంశీ అన్న నువ్వు ఆట బాగా ఆడుతున్నావ్.. నువ్వు, త్రిగుణ్ అన్న బాగున్నారు.. ఇద్దరిని చూస్తుంటే కృష్ణార్జునుల్లా ఉన్నారని అంటుంది. త్రిగుణ్ కృష్ణుడు, వంశీ అర్జునుడని చెప్తుంది. ఇక ఆ ఇద్దరూ కలిసి టాప్-3లో త్రిగుణ్, వంశీ, నరేష్ ఉంటారని చెప్తారు.  ఆర్కే, నీతూ, శివ్ టాప్-5లోకి అనర్హులు అని చెప్తారు. ఆ తర్వాత వంశీకి సంబంధించిన బీబీ పోస్టర్.. బాహుబలి టైపులో ఉన్న వంశీ పోస్టర్‌ను రివీల్ చేస్తారు.ఆ తర్వాత వర్షిణి కోసం అక్క సౌజన్య, యాంకర్ రవి వస్తారు. టాప్-3లో త్రిగుణ్, ముఖేష్, వర్షిణి ఉంటారని సుధీర్, వంశీ, ఆర్కే టాప్-5కి అనర్హులు అని చెప్తారు. ఆ తర్వాత వర్షిణి సేఫ్ అని తెలుస్తుంది. మహానటిలా వర్షిణి పోస్టర్‌ను రివీల్ చేస్తారు.

 

రామ్ ప్రసాద్ కోసం నాన్న ఆది నారాయణ, గెటప్ శ్రీను వస్తారు. ఆ ఇద్దరూ కలిసి టాప్ 3లో ఆర్పీ, త్రిగుణ్, వంశీ అని చెప్తారు. అనర్హులుగా ఆర్కే, నీతూ, శ్వేత అని పెడతారు. ఇక జాతిరత్నాలు పోస్టర్‌ను రివీల్ చేస్తారు. అందులో దేబ్జానీ, నరేష్, రామ్ ప్రసాద్ కలిసి ఉంటారు. అమన్ కోసం అక్క నౌషిన్, బావ తౌషిఫ్ వస్తారు. టాప్ 3లో అమన్, నరేష్, త్రిగుణ్, అనర్హులుగా సుధీర్, ఆర్కే, వర్షిణి అని చెప్తారు. అమన్ సేఫ్ అవ్వడంతో రేసుగుర్రం స్టైల్లో ఉన్న పోస్టర్‌ను రివీల్ చేస్తారు.మొత్తంగా చూస్తే దాదాపు అందరూ త్రిగుణ్‌ను టాప్ 3లో పెట్టడం విశేషం. ముకేష్‌కు కూడా మంచి సపోర్ట్ కనిపించింది. దీంతో విన్నర్ త్రిగుణ్, రన్నర్ ముఖేష్ అవుతారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అనర్హుల్లో మాత్రం ఆర్కే, సుధీర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com