ENGLISH | TELUGU  
Home  » TV News

దుగ్గిరాల ఇంటికి కోడలిగా వస్తానని చెప్పిన స్వప్న!

on May 20, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో.. స్వప్నతో రాహుల్ మాట్లాడతాడు. మన పెళ్లి జరగదు.. మా ఇంట్లో వాళ్ళకి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా.. మీ చెల్లి చేసింది. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవట్లేదని రాహుల్ అంటాడు. ఏంటి రాహుల్ అలా మాట్లాడుతున్నావ్.. ప్రేమ మొదట్లో పెద్ద వాళ్ళు ఒప్పుకోరు.. మనమే ఒప్పించాలని స్వప్న అంటుంది. ఏది ఏమైనా నన్ను మర్చిపో.. నీ జ్ఞాపకాలతో బతికేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాహుల్.

మరొకవైపు కావ్య ఆటోలో ఇంటికి వెళ్తుంటే.. దారిలో స్వప్నని చూసిన కావ్య తన దగ్గరికి వస్తుంది. నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? రాజ్ ఎక్కడ? రాజ్ ని కూడా తీసుకొచ్చావా అని వెటకారంగా అంటుంది స్వప్న. రాజ్ వాళ్ళ ఇంట్లో అందరి దృష్టిలో నన్ను బ్యాడ్ చేసావ్.. రాహుల్ కి నాకు మధ్య జరిగిందంతా అందరికి తెలిసేలా చేసావంటూ కావ్యపై కోప్పడుతుంది స్వప్న. నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నావని కావ్య అంటుంది.

నేను దుగ్గిరాల ఇంటికి కోడలిగా వస్తే నీకు గౌరవం దక్కదు. నీకు అన్నింట్లో పోటీగా వస్తానని ఇలా చేసావ్ కదా? ఎలాగైనా రాహుల్ ని పెళ్లి చేసుకొని దుగ్గిరాల ఇంటికి కోడలిని అవుతానని చెప్పి స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్వప్న ఇంటికి వెళ్లేసరికి.. ఇంట్లోకి రావద్దంటూ కృష్ణ మూర్తి గొడవపెడతాడు. స్వప్న వాళ్ళ పెద్దమ్మ మధ్యలో కలుగజేసుకొని కృష్ణమూర్తి, కనకంలకి నచ్చజెప్పి స్వప్నని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కనకం ఎలాగైనా స్వప్నకి పెళ్లి చేసి పంపించాలని భావించి.. మీనాక్షికి ఫోన్ చేసి పెళ్లి సంబంధం ఉందని చెప్పావ్ కదా? వాళ్ళని రమ్మని చెప్పని కనకం అంటుంది.

దానికి మీనాక్షి సరేనని అంటుంది. మరొకవైపు కావ్య ఎక్కడికి వెళ్లిందోనని కంగారుగా ఇందిరాదేవితో పాటు తన కోడళ్ళు అందరూ కలిసి హాల్లో కూర్చొని తనకోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే కావ్య అటో దిగి లోపలికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్? చెప్పి వెళ్ళాలని తెలియదా అని కావ్యపై అపర్ణ కోప్పడుతుంది. ఉదయం రాజ్ టిఫిన్ చెయ్యలేదని, భోజనం తీసుకెళ్ళాను.. పెద్ద మామయ్య, చిన్న మామయ్యలతో పాటు రాజ్ కి భోజనం పెట్టి వస్తున్నాని కావ్య చెప్తుంది.

మరొకవైపు స్వప్నకి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి.. లేదంటే మళ్ళీ మనకు తలవంపులు తెచ్చే పని చేస్తుందని కృష్ణమూర్తి, కనకం ఇద్దరు మాట్లాడుకుంటారు. మరొకవైపు రాజ్ గురకని కావ్య ఫోన్ లో రికార్డు చేస్తుంది. ఆ వీడియోని రాజ్ కి తెలియకుండా ప్లే చేస్తుంది. ఏంటి ఎక్కడ గురక అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.