.webp)
ఫామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఒక బంగారం లాంటి ఎపిసోడ్ రెడీ గా ఉంది అని చెప్పుకొచ్చాడు సుధీర్. తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు తమ కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ని అలరించారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, ఫన్నీ డైలాగ్స్‌తో సందడి చేశారు. సుధీర్ చుట్టూ జరిగిన కొన్ని సంభాషణలు నవ్వులు పూయించాయి. నిధి వేట, సరదా టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఎపిసోడ్‌కు స్పెషల్ అట్రాక్షన్ గ ఉన్నాయి. ముందుగా కంటెస్టెంట్ల డ్రెస్సింగ్‌పై సరదా కామెంట్లు చేశారు. ఒకరిని ఉద్దేశించి.. "సిమెంట్ బస్తాకు బట్టలేసినట్టు ఉంటావ్ మరి నీకెందుకే బంగారు నగలు ?" అని అష్షు రెడ్డి ఫైర్ అయ్యింది స్రవంతి మీద . వెంటనే స్రవంతి "నువ్వేమైనా తక్కువానే .. డస్ట్ బిన్ కి డ్రెస్ వేసినట్టుంటావ్ " అంటూ పంచ్ వేసింది . పర్ఫెక్ట్ అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు.
"సుధీర్ గారు మీ అవుట్ ఫిట్ చాలా బాగుంది అంటూ కావ్య సుధీర్ కి కాంప్లిమెంట్ ఇచ్చింది. "వచ్చేటప్పుడు చెరువులోంచి వచ్చావు కలర్ ఫుల్ కలవ పూలు ఉన్నాయి షర్ట్ మీద "అంటూ పంచ్ ప్రసాద్ కామెడీ చేసాడు.
తర్వాత సుధీర్ "అందరూ ఆ నిధి కోసం గొడవపడుతున్నారు " అన్నాడు కావ్యతో. "అంటే మీరు గొడవపడట్లేదా" అంటూ సుధీర్ ని అడిగింది. " నిధి నా దొరికినప్పుడు మళ్లీ ఎందుకు గొడవపడాలి ?" అన్నాడు. "హాయ్ దేవిశ్రీ గారు" అనగానే వెంటనే ఆమె "నా పేరు దేవిశ్రీ కాదు.. దివ్యశ్రీ" అని సరిచేసింది. "మీరు నా గుండెల్లో మోత మోగించేసరికి దేవిశ్రీ అనుకున్నా" అంటూ సుధీర్ కామెడీ చేసాడు. ఫైనల్ లో సుధీర్ ఒక అనౌన్స్మెంట్ చేసాడు "పట్టాభిషేకానికి సిద్ధంగా చేసుకోండి .. వచ్చే వారం నుంచి మరదళ్ళు చేంజ్ " అని చెప్పాడు.






