Home

»

Tv News

BiggBoss 10 Telugu : జబర్దస్త్‌లో అగ్నిపరీక్ష రాజకుమారి డయానా.. బిగ్ బాస్ టీమ్ షాక్!

Nov 12, 2026 10:05AM

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రాజకుమారి బాగానే పర్ఫామ్ చేసింది. పైగా అక్కడ గ్రీన్ బ్యాడ్జిలను కూడా సంపాదించుకుంది. ఆమె కచ్చితంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంటుందని, జ్యూరీ సెలెక్ట్ చేస్తుందని అనుకున్నారు. బిగ్ బాస్ టికెట్‌ని చివరగా ఝాన్సీ చేజిక్కించుకుంటుంది. జ్యూరీలు అయినా ఆమెని సెలెక్ట్ చేసుకుంటారని అంతా భావించారు. కానీ చివరకు శ్రిష్టి, షాలినీ, అపూర్వ అంటూ ఇలా అందరినీ గ్లామర్ కేటగిరీలోనే సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. అయినా బిగ్ బాస్ టీమ్ కి ఉండే లెక్కలు ఉంటాయి. అందుకే రాజకుమారిని అంతగా మొదటి నుంచి పైకి లేపి.. చివరకు సింపుల్‌గా పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది.

అందుకే ఆమె ఇప్పుడు ప్రత్యామ్నాయంగా జబర్దస్త్ షోకి వెళ్లి అక్కడే సెటిల్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య అప్పుడప్పుడు జబర్దస్త్ స్కిట్లలో కనిపించేది. నూకరాజు టీంలో రాజ కుమారి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇకపై అక్కడే రాజకుమారి ప్రయాణం సాగేలా ఉంది. మరి స్టార్ మా ఈవెంట్లు, స్టార్ మా పెట్టే షోల్లో రాజకుమారి ఇకపై కనిపిస్తుందా? ఆమెని పూర్తిగా పక్కన పెడతారా? అన్నది చూడాలి. అగ్ని పరీక్ష కంటెస్టెంట్‌గా అయితే రాజకుమారికి మంచి పేరు, క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.అగ్ని పరీక్ష నుంచి వెళ్లిన లేడీ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆరుగురు అగ్ని పరీక్ష కంటెస్టెంట్లలో కూడా లేడీ కంటెస్టెంట్లు ఎక్కువగా లేరు. అందుకే రాజకుమారికి ఛాన్స్ ఇవ్వలేదని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ జబర్దస్త్‌లో ఆమెకి మంచి స్కోప్ ఉందని, కామెడీ టైమింగ్‌తో ఆమె అక్కడ నిలదొక్కుకుంటుందని అంటున్నారు. బిగ్ బాస్ హ్యాండ్ ఇచ్చినా.. జబర్దస్త్‌లో రాజకుమారి ఎంట్రీతో బిగ్ బాస్ టీమ్ షాక్ లో ఉన్నారు. బిగ్ బాస్ టీమ్ తర్వాతి సీజన్ కి రాజకుమారికి ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి మరి.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com