
జబర్దస్త్ కమెడియన్ హీరో సుధీర్ నటిస్తున్న సరికొత్త మూవీ "గొట్". ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచు మనోజ్ వచ్చారు. రావడమే ఈ మూవీ హిట్ కొట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ సుధీర్ గురించి మాట్లాడారు. గోట్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ మాట్లాడిన ఆయన తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయిన విజయ్‌ను ప్రస్తావించారు. ఇదే సందర్భంగా సుధీర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ముందుగా గోట్ సినిమా పెద్ద విజయం సాధించాలని దేవుడిని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. దీనికి స్పందిస్తూ ఈ సినిమా 100 శాతం హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ తర్వాత విజయ్ గురించి ప్రస్తావిస్తూ.. "వచ్చే దారిలో నాకు ఒకటే డౌట్ వచ్చింది. ముందుగా ఈ టైటిల్ గోట్ అని రిజిస్టర్ అయింది. ఆ తర్వాత విజయ్ గారు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అని పెట్టుకున్నారు. ఆయన కూడా గోట్ సినిమా చేశారు. ఇప్పుడు సీఎం అయిపోయారు" అంటూ కామెంట్ చేశారు.
అక్కడితో ఆగకుండా సుధీర్‌ను ఉద్దేశించి.. "బాబాయ్.. నీకు కూడా సీఎం అవ్వాలనే ఆలోచన ఏమైనా ఉందా? నిజం చెప్పు.. నీ ఉద్దేశం ఏంటి? రెండు రాష్ట్రాలకా.. ఏంటి నీ ఉద్దేశం " అంటూ సరదాగా ఆటపట్టించారు . అయితే దీనికి పెద్దగా సమాధానం రాకపోవడంతో "ఏం లేదా? ఓకే.. ఎనీ వేస్" అంటూ నవ్వుతూ మాట ముగించారు. తర్వాత అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. "ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లవ్ యు ఆల్" అని సరదాగా మాట్లాడారు. సుధీర్ తమ్ముడు చెప్పినట్టుగా అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని ఫాన్స్ కి సూచించారు. మొత్తంగా గోట్ సినిమా, విజయ్ రాజకీయ విజయం, సుధీర్ సీఎం అవుతారా అంటూ సాగిన ఈ సరదా సంభాషణ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.




.webp)
.webp)
