Home

»

Tv News

శ్రీముఖి కొత్త లగ్జరీ ఇల్లు.. దీపావళి రోజున గృహప్రవేశం

Nov 12, 2026 9:46AM

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన అందం, మాటతీరుతో ఆడియన్స్ ని  ఆకట్టుకునే ఈ యాంకర్.. తాజాగా కొత్త లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రస్తుతం శ్రీముఖి టీవీ షోలతో పాటు సినిమా ఈవెంట్లకు  హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. మరోవైపు వ్యాపారాల్లో కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫాన్స్ తో  తన పర్సనల్ , వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది . ఇలా పలు మార్గాల్లో బిజీగా ఉంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

లేటెస్ట్ గా  దీపావళి పండుగను పురస్కరించుకుని కొత్త ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించిన శ్రీముఖి.. తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఆనందంగా కనిపించింది. తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని అందమైన ఇంటీరియర్ డిజైన్‌తో తీర్చిదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీముఖి రెమ్యూనరేషన్ కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఒక్కో టీవీ ఎపిసోడ్‌కు సుమారు రూ.2.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, వ్యాపారాలు, సోషల్ మీడియా ద్వారా ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీముఖి.. ఇప్పుడు కొత్త ఇంటితో మరో సంతోషాన్ని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఆమె గృహప్రవేశం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com