Home

»

Tv News

షోల్లో సుధీర్ పెళ్లి గోలే!

May 01, 2026

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సుధీర్ పెళ్లి గోల షోస్ లో బాగా హైలైట్ అవుతోంది. ఇటు జీ తెలుగులో ప్రసారమైన ఈ వీక్ ఆట డాన్స్ షోలో ఆట ట్రోఫీ లాంచింగ్ కి వచ్చిన రాజశేఖర్ - జీవితను సుధీర్ అడిగాడు పెళ్లి చేసుకోవాలా వద్దా అని . అలాగే ఆహాలో ఈ వీక్ ప్రసారమైన సర్కార్  లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా సుధీర్ ఇదే ప్రశ్న అడిగాడు. "సర్ పెళ్లి చేసుకోవచ్చా నేను ..అసలు పెళ్లి చేసుకోవాలా లేదా అని ఆలోచించాలా లేదా ఎవరిని చేసుకోవాలా అని ఆలోచించాలి " అని సుధీర్ అడిగాడు. "ఎందుకు అంత కష్టం వచ్చింది పెళ్ళికి. చేసుకోండి.. మంచిగా ఉంటుంది.

ఈరోజు నేను ఇలా మంచి పేరు రావడానికి కారణం జీవిత. నన్ను దేవుడు సామిలా చూసుకుంటుంది ?" అని చెప్పాడు రాజశేఖర్. ఇక సర్కార్ షోకి వచ్చిన ఆలీని కూడా సుధీర్ "అన్నా పెళ్లి చేసుకోవాలా వద్దా ఇది చెప్పండి" అని అడిగాడు. "అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా " అని అలీ అడిగాడు. "అన్ని బానే ఉన్నాయన్నన్నా " అన్నాడు సుధీర్. "మరి ఆ ఒక్కటి కరెక్ట్ గా చూసుకో " అన్నాడు. దాంతో అక్కడికి వచ్చిన మరో గెస్ట్ శివాజీ కో - హోస్ట్ విష్ణుప్రియ నవ్వేశారు. "అంటే కార్ - ఇల్లు - మంచి ఫామిలీ . ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అంటారుగా అలా " అని అలీ కవర్ చేసాడు.

"పెళ్లయ్యాక భార్య ఎలా ఉంటుందన్న " అని సుధీర్ అడిగాడు. "భార్యను మించిన దేవత లేదురా " అని అలీ చెప్పాడు. "ఎవరు చెప్పారన్నా " అని సుధీర్  అడిగేసరికి "మా ఆవిడ చెప్పింది " అన్నాడు అలీ. "మరి శివాజీ అన్న పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు " అని అడిగాడు సుధీర్. "అలాగే అంటాడులే వాడు పెళ్లి చేసుకున్నాకే కదా స్టార్ అయ్యింది. " అని చెప్పాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com