.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -258 లో.....సుధా గురించి పెద్దసారు ఆలోచిస్తాడు. గంగ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావ్ గంగ అని అడుగుతాడు. సుధా పెట్టిన చీర చూసి గంగ మురిసిపోతుంది. ఈ చీర అమ్మగారు పెట్టారు ఎలా ఉంది అని గంగ అడుగుతుంది. ఈ కలర్ చీర సుధాకి చాలా ఇష్టం అని పెద్దసారు అనుకుంటాడు. మీరు వెళ్లి వాళ్ళింటి దగ్గర భోజనం చేశారు కదా వాళ్ళని కుడా భోజనానికి పిలవాలి కదా అని పెద్దసారు అంటాడు. అవును అని గంగ అంటుంది.
అయితే ఇప్పుడే ఫోన్ చేసి పిలువు అని పెద్దసారు అంటాడు. సరే అని గంగ ఫోన్ చేస్తుంది. అమ్మ గారు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని గంగ పిలుస్తుంది. వస్తాను కానీ ఇప్పుడు కాదని సుధా అంటుంది. మా పెద్దోరు పిలవమని చెప్పారని గంగ అంటుంది. మీ పెద్దోరికి నమస్కారం చెప్పానని చెప్పమని సుధా అంటుంది. పక్కనే ఉన్నారు మాట్లాడండి అని గంగ ఫోన్ ఇస్తుంది. అప్పుడే విశ్వ వచ్చి పిలుస్తాడు. ఆ తర్వాత వీరు రాత్రి తాగి ఇంటికి వస్తాడు. ఏంటండీ మీరు తాగడం ఏంటని ప్రీతీ అడుగుతుంది. ఏం చేయమంటావ్ ప్రీతీ.. నేనొక చేతకానీ వాడిని.. ఇన్ని రోజులు అంటే నేను అన్ని బిజినెస్ లు చూసుకునే వాడిని కాళీ గా ఉంటే ఎవరు విలువ ఇవ్వడం లేదు.. కొత్త బిజినెస్ కి వేరే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు.. నేనొక లూజార్ ని అని వీరు ఎమోషనల్ గా మాట్లాడుతాడు. నాకు మీ బాధ అర్ధం అయిందని ప్రీతీ అనుకుంటుంది. వీరు, ప్రీతీని చూస్తూ.. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని చెయ్యాల్సిన పనులు అన్ని చేయించుకుంటానని వీరు అనుకుంటాడు.
ఆ తర్వాత మరుసటిరోజు రుద్ర దగ్గరికి ప్రీతీ వస్తుంది. అన్నయ్య నీతో ఆయన గురించి మాట్లాడాలి.. అయన ఖాళీగా ఉంటున్నాడు కదా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడు.. నాన్నతో చెప్పి కొత్త బిజినెస్ అయినా మన బిజినెస్ అయినా హ్యాండ్ ఓవర్ చెయ్యమని చెప్పమని ప్రీతీ అంటుంది. నాకు తెలుసు కదమ్మా ఖచ్చితంగా వీరుతో బిజినెస్ స్టార్ట్ చేపిస్తానని రుద్ర అంటాడు. అదంతా ఇషిక, వీరు వింటారు. నువ్వు అనుకున్నది చేసావ్ బ్రో అని ఇషిక అంటుంది. ఆ తర్వాత గంగకి సుధా ఫోన్ చేస్తుంది. అప్పుడే వాళ్ళు మాట్లాడుకునేది పెద్దసారు వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
