Home

»

Tv News

మల్లారెడ్డి జీవితంలో ఇంతుందా!

May 01, 2026

సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ లో వచ్చిన ముగ్గురు గెస్టులు ముమూలోళ్లు కాదు. శివాలి, అలీ, మల్లారెడ్డి. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. అందులో పొలిటికల్ లీడర్ గా ఉన్న మల్లారెడ్డి జీవితం ఈ ఎపిసోడ్ లో ఆడియన్స్ కి వివరించారు."చిన్నప్పుడు ఆడిన ఆటలు ఏంటి అందులో బెస్ట్ మెమరీ ఏంటి" అని సుధీర్ అడిగాడు. మల్లారెడ్డి చెప్పిన మాటలు మాములుగా లేవు. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. " ఆ చదువుకునేదే కష్టమూ ఆటా పాటా ఎక్కడిదివయ్యా. మీలెక్క జాలీగా తిరిగేటిది స్టైల్ కొట్టేటిది అప్పట్లో ఏమీ లేవు. రోజూ పని చేసుకోవాలి.

పేడ  తియ్యాలి. పాలు తీయాలి. పాలు సప్ప్లై చేసుకోవాలి సైకిల్ మీద వెళ్లి  పాలు అమ్ముకుని రావాలి. 1976 లో నా పెళ్లి అయ్యింది. నా పెళ్లి అయ్యే సమయానికి నా దగ్గర సైకిల్ , రెండు పాల క్యాన్లు, పశువులు ఉన్నాయి. ఇప్పటికి 50 ఏళ్ళు అయ్యింది. నేనేమి ఏఐని కాదు.  రోజూ పని చేసుకుంటూ ఉండేవాడిని. పాలమ్మను, పూలమ్మను, బోర్ వెల్స్ నడిపాను. కష్టపడి స్కూల్స్ పెట్టి కాలేజీలు పెట్టాను. ఎంపీ , ఎంఎల్ఏ , మినిస్టర్ అయ్యాను. అందరూ అదృష్టం అనుకుంటారు కానీ కాదు కష్టం. ప్రతి రూపాయికి పని చేసినా, ప్రతి నిమిషానికి పని చేసిన. 10 రూపాయలు ఉంటే 100 రూపాయల పని చేసినా. ఒక రోజు కళ్ళల్లో ఒత్తులేసుకుని, కడుపు జంపుకుని రాత్రియంబవలు ఆలోచన చేసేవాడిని. నాకెవరూ అడ్వైజర్ లేరు.

ఈరోజున 50 వేల మంది స్టూడెంట్స్, 10 వేల మంది టీచర్స్, దేశంలో కెల్లా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎవరివి అంటే మావే. 1987 లో ఒక స్కూల్ పెట్టాం. ఒక ఆవిడకి ఆ బిల్డింగ్ ని రెంట్ కి ఇచ్చాము. 1988 లో ఆమెకు మాకు గొడవలు వచ్చాయి . అప్పట్లో క్లాస్ కి 40 మంది ఉండాలి 30 రూపాయలు ఫీజు ఉండాలి. అంటే క్లాస్ కి 1200 వచ్చేది టీచర్స్ కి 1200 నుంచి 1500 ఇవ్వాల్సి వచ్చేది. దాంతో ఆమె మమ్మల్ని పార్ట్నర్ గా ఉండమని అడిగింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆమెకు మాకు గొడవలు వచ్చాయి. ఆమె గుడ్ విల్ తీసుకుని ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయింది. అదే స్కూల్ ని ఇప్పటివరకు నడిపిస్తూ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్  చేసాం.

మా రూట్ ఇది కాదు అసలు మా సబ్జెక్టు కూడా కాదు. భగవంతుడు ఆ దారి చూపించాడు ఆ దారిని పట్టుకుని ఈ దారి  వరకు వచ్చేసాను. అమెరికా, సింగపూర్ లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మా కాలేజ్ లో ఏఐ విత్ ఎంబిబిఎస్ , డెంటల్ విత్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ , ఫార్మసీ విత్ ఏఐ , నర్సింగ్ విత్ ఏఐ " అంటూ చెప్పుకొచ్చారు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com