సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది
on Jul 12, 2025
సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది.
అదే ఫస్ట్ టైం నేను మీ ఇద్దరూ లేకుండా ఆ పరిస్థితిని ఫేస్ చేశా గట్టిగా. మేకప్ వేసుకునే అద్దం ముందుకెళ్లి ఏంటి కొత్తగా ఉంది నిజంగా ఏదో పవర్ నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. తొమ్మిదిన్నరేళ్ళు కలిసి పని చేసాం. కానీ ఒక్కసారి నేను ఒక్కడినే స్టేజి మీదకు వెళ్లేసరికి తెలియని ఒక భయం వచ్చేసింది. అఫ్కోర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చింది నా గురించి నేను బతకడానికి కూడా కాబట్టి ఆ విషయాన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఎక్కడికి పోతారు బయటకు వెళ్లి కలుస్తాను...అప్పుడే మీరు లేనప్పుడే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదే నా లైఫ్ లో బాధపడిన విషయం" అన్నాడు రాంప్రసాద్. అవును ..మేము కూడా నిన్ను చాలా మిస్సయ్యాం..అలాగే ఆ స్టేజిని కూడా మిస్సయ్యాం అని చెప్పాడు సుధీర్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
