సుధీర్ ని చిన్న పిల్లల చేత కూడా తిట్టిస్తున్నారు..హర్ట్ అవుతున్న ఫ్యాన్స్
on Apr 25, 2025
సుధీర్ హోస్ట్ గా ఏ షో ఐనా కూడా ఫుల్ రేటింగ్ ఉంటుంది అని మేకర్స్ కూడా సుధీర్ తో కొన్ని షోస్ చేయిస్తున్నారు. రీసెంట్ డ్రామా జూనియర్స్ సీజన్ 8 కి హోస్ట్ గా చేస్తున్నాడు సుధీర్. ఐటీ ఈ షో మొదలైన దగ్గర నుంచి సుధీర్ మీద చిన్న పిల్లలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ షో ప్రోమోలో కూడా అదే జరిగింది. శ్రీమనో అనే చిన్నారి వచ్చి సుధీర్ ని పిచ్చపిచ్చగా తిడుతూ జోక్స్ వేసింది. "నా కూతురుని ఎవరో ఒకరికి కట్టబెట్టాలి కదా" అని ఆ పిల్ల అనేసరికి " నేను ఉన్నాగా అత్తా " అన్నాడు సుధీర్. 'ఏడ్చావులే వెర్రి సచ్చినోడా. ఎం మాట్లాడుతున్నావురా బడుద్దాయి...ఓలమ్మో ఓలమ్మో ఈ ముదనష్టపోడు ఎన్ని మాటలు అంటున్నాడో" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇక జడ్జ్ అనిల్ రావిపూడి ఐతే తధాస్తు దేవతలు నీకు ఇలాంటి అత్తను ప్రసాదిస్తారేమో అనుకుంటున్నా అన్నాడు. ఇక పిల్లలు ఇలాంటి తిట్లు తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు.
"మా సుధీర్ ని వెధవని చెయ్యడానికే ఈ షో పుట్టినట్టు ఉంది. యాంకర్స్ అందరినీ ఇలాగే చేస్తున్నారా...మర్యాద ఇవ్వండి...చిన్న పిల్లల చేత కూడా తిట్టిస్తున్నారే" అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ విషయం మీద కామెంట్స్ బాగా చేస్తున్నారు. సుధీర్ ని ప్రతీ షోలో తిట్టడమే పనిగా స్కిట్స్ నడుస్తున్నాయి...ఐతే దీని మీద నెటిజన్స్, సుధీర్ ఫాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
