ENGLISH | TELUGU  
Home  » TV News

బిగ్ బాస్ ఫేమ్ సుదీప కొత్తగా కొన్న గింబల్!

on May 4, 2023

 

పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.

అయితే బిగ్ బాస్ సీజన్‌-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.‌. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఖతర్ వెళ్ళినట్టుగా చెప్పింది పింకి. అక్కడ ఒక నేషనల్ పార్క్ లో తన బాడీతో ఒక షేప్ వచ్చేలా డిజైన్ తో కూడిన అచ్చులు ఉండటంతో సరదగా తనకి ఏ ఫోజ్ సూట్ అవుతుందో ఆ ఫోజ్ కి తన బాడీని తాకగా.. తన బాడీ షేప్ తో ఒక ఫోజ్ క్రియేట్ అవుతుంది. ఇది చూసి చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయిందంట సుదీప.. ఇక అక్కడ దోహా అనే ప్లేస్ తనకి నచ్చిందని మరొక పోస్ట్ చేసింది సుదీప. 'I came, I Saw, I Fell in love with Doha' అని పోస్ట్ చేసింది సుదీప.

సుదీప చేసిన ఈ పోస్ట్ లతో తన అభిమానులు.. 'నేను ఖతర్ లోనే ఉన్నాను' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా తను కొత్త గింబల్ తీసుకుందంట. దాంతో వాళ్ళ అక్క వాళ్ళ పాపతో రీల్స్ చేపిస్తూ కనువిందు చేసింది సుదీప. కొత్త గింబల్ కొన్నందుకు గానూ ఏదో ఒక రీల్ చేయాలని ఒక చిన్న వ్యాయామం చేపించింది సుదీప. అయితే చాలారోజులకు కనిపించావంటూ సుదీప అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.