Home

»

Tv News

Brahmamudi: కాంట్రాక్ట్ కోసం ఐశ్వర్య కుట్ర.. రఘువీర్ ఏం చేయనున్నాడు!

Nov 22, 2026 8:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1195.... లో కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తూ స్టాఫ్ పై అరుస్తుంది ఐశ్వర్య. ఇంతలో పారు వచ్చి మీరు చాలా లక్కీ, లేదంటే రఘువీర్ సర్ మిమ్మల్ని నమ్మడం ఏంటని సెటైర్లు వేస్తాడు. మరోవైపు ఇందు వర్క్ లో బిజిగా ఉండగా రాజ్ వచ్చి కాఫీ ఇస్తాడు. ఆఫీసులో ఉన్న స్టాఫ్ మొత్తం వెళ్లిపోయారు.. త్వరగా ఇంటికి వెళ్లిపోదామని చెప్తాడు. కొటేషన్ ఫైనల్ కి వచ్చింది.. వెళ్దామని అంటుంది ఇందూ. ఇంతలో రాజుకి అపర్ణ ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదని మండిపడుతుంది.

పక్కకి వెళ్లి నానమ్మ చేత ఇలా మాట్లాడమని నువ్వే ఫోన్ చేయించావా అని రాజ్ పై సీరియస్ అవుతుంది ఇందూ. నాకేం శోభనం గురించి కక్కుర్తి లేదు.. ఈ రాత్రంతా ఇక్కడే ఉందామని అంటాడు రాజ్. 5 నిమిషాల్లో నేను వచ్చేస్తానని అంటుంది ఇందూ. మొత్తం వర్క్ ఫినిష్ చేశాను, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పడకుండా కొటేషన్ రెడీ చేశానని రఘువీర్ తో చెప్తుంది ఐశ్వర్య. కానీ ఆమె మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా కాఫీ తాగుతాడు రఘువీర్. ఐశ్వర్య తయారు చేసిన కొటేషన్ ని రఘువీర్ చించేస్తాడు.. దాంతో ఐశ్వర్య సీరియస్ అవుతుంది.

కష్టపడితే కాంట్రాక్ట్ లు రావు.. తెలివితేటలతో సంపాదించుకోవాలని అంటాడు రఘువీర్. నువ్వు కంపెనీ పెట్టి నెల రోజులు కూడా కాలేదు.. కానీ కొన్నేళ్లుగా సిటీలోనే నెంబర్ వన్ కంపెనీగా ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంకెలా ఆలోచిస్తుందని అంటాడు. మన దగ్గరున్న స్టాఫ్ కంటే ఆ ఇందూ-రాజ్ ల దగ్గరున్న ఉద్యోగులు టాలెంటెడ్ అని చెప్తాడు. ఆ స్వరాజ్ గ్రూప్ వేస్తున్న కొటేషన్ ఎంతో తెలిస్తే వాళ్ల కంటే తక్కువకి కొటేషన్ వేద్దామని చెప్తాడు రఘువీర్. డబ్బుంటే ఏదైనా సాధ్యమేనని చెప్తుండగా, స్వరాజ్ కంపెనీలో ఇందూకి అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ ఫోన్ చేస్తాడు. వాళ్లు వేసిన కొటేషన్ మీకు పంపించడం కుదరదు.. నా మనిషిని మీ దగ్గరకి పంపిస్తున్నానని చెప్తాడు.

ఇందూ-రాజ్ ల ఫస్ట్ నైట్ కి పనిమనిషితో కలిసి డెకరేట్ చేస్తుంది అపర్ణ. ఈ హడావుడి చూసిన భ్రమరాంబ, ఇందూ-రాజ్ లను ఏం చేస్తావని రేఖని అడుగుతుంది. అది సర్ ప్రైజ్, ఈరోజు వారిద్దరి జీవితాలు తెల్లారిపోతాయని అంటుంది రేఖ. ఫస్ట్ నైట్ కావడంతో రాజ్ పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఇంతలో లక్కీ వచ్చి నేను హెల్ప్ చేస్తానని అంటాడు. నువ్వు నాకు చేసిన ద్రోహం ఎప్పటికీ మరిచిపోలేనని రాజ్ మండిపడతాడు. అటు ఇందూని కూడా నందూ అందంగా ముస్తాబు చేస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Star Maa TV Brahmamudi serial Saturday episode, Brahmamudi today episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com