స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -836...లో తన నిర్ణయం ఏంటో చెప్పమని జ్యోత్స్న అడిగితే నిర్ణయాలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని.. ఆలోచన పాడైతే చెప్పడానికి పనికిరాదని సూరజ్ అంటాడు. దిండు కింద ఉన్న తాళి చూసి ఇంకేం లేదని గుడ్ బై చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు జ్యోత్స్న అకౌంట్ లో 2 కోట్లు వేసినందుకు తన డబ్బు కావాలని మాలినిని పారిజాతం అడుగుతుంది. పని పూర్తి కాలేదని మాలిని అంటుంది.ఆ మాటలు జ్యోత్స్న విని పారుతో గొడవపడుతుంది.
మరుసటిరోజు ఆఫీస్ లో జ్యోత్స్నను చూసి మాలిని షాక్ అవుతుంది. నా ప్రేమను సూరజ్ దృష్టిలో అమ్ముకునే మనిషిని చేశావు.. ఇక చాటుమాటు యుద్ధాలు లేవు డైరెక్ట్ వారే అని జ్యోత్స్న అంటుంది. చావు దెబ్బలు కొట్టికొట్టి నీకు అలుపు వస్తదేమో నాకు ఊపు వస్తదని లెజెండ్ బాలకృష్ణ డైలాగ్ తో వార్నింగ్ ఇస్తుంది. త్వరలో నీ కొడుకుతోనే నా మెడలో మూడు ముళ్లు వేయించుకుంటా.. దమ్ముంటే ఆపుకోమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. ఈ మాటలన్నీ కార్తీక్, దీప వింటారు.
జ్యోత్స్న ఛాలెంజ్ తో సూరజ్ కి తన వర్క్ చూసుకోమని చెప్పి 2, 3 ఏళ్లు పట్టొచ్చని అంటాడు. సూరజ్ జ్యోత్స్నల పెళ్లి జరగాలంటే మాలిని నిజస్వరూపం సూరజ్ కి తెలియాలని కార్తీక్, దీప అనుకుంటారు. మరోవైపు మాలిని తన బాడీగార్డ్ తో మాట్లాడుతుంది. ఈసారి జ్యోత్స్నను దాచడం కాదు లేకుండా చేయాలని.. రేపు తెల్లవారేలోగా పని అయిపోవాలని మాలిని చెప్తుంది. ఆ మాటలు దీప వినేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Karthika Deepam2 Serial November 21st Episode, Star Maa Karthika Deepam2




