
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -636....లో.. చెడు బుద్ధులు ఇక్కడితో వదిలేసి ఇంట్లోకి రా లేదంటే రావొద్దని సాగర్ తో రామరాజు చెప్తాడు. దానికి సాగర్ అవసరం లేదు.. ఏం చేశావ్ నువ్వు నా జీవితం కోసం.. నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని తండ్రి మీదకు వెళ్తాడు. ఈయనే కాదు ఏ తండ్రి తన కొడుకు నాశనం కోరుకోడని సాగర్ ని వేదవతి తిడుతుంది. కొడుకు ఎదుగుదల చూడాలనుకున్న తండ్రి సాయం చేస్తాడు. ఈయన మాత్రం నా మీద నోరు వేసుకొని పడిపోతాడని సాగర్ అంటాడు. నేను ఈ ఇంట్లో ఉండను వెళ్లిపోతానని వెళ్తుంటే చందు, ధీరజ్, తిరుపతి ఆపుతారు. తప్పులు చేసింది నువ్వు, వాటిని సరిదిద్దుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఎవరు సాయం చేస్తారని సాగర్ తో ధీరజ్ అంటాడు. ఏ తండ్రి తన కొడుకు తప్పుదారిలో వెళ్తే ఊరుకోడని, అందుకే నాన్న మందలించారని అంటాడు. సాగర్ ని తీసుకొని లోపలికి వెళ్తారు. వాడు కష్టపడి సంపాదించిన ఉద్యోగం పోయింది.. వాడి జీవితం రోడ్డున పడింది కదా అని వేదవతి ఏడుస్తుంది.
వల్లీ తను ప్రెగ్నెంట్ అనే విషయం అత్తింట్లో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి నర్మదకి చెప్పాలని ఫోన్ చేస్తుంది. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి నర్మద అని వల్లీ అంటే నేను ఇప్పుడు ఏం వినే పరిస్థితిలో లేనని నర్మద అనేస్తుంది. సరే మూడ్ బాగున్నప్పుడు కాల్ చెయ్ చెప్తానని వల్లీ అంటుంది. భాగ్యం వల్లీతో ఇప్పటికైనా నా మాట వినవే, ఏదో మాయ చేసో మంత్రం వేసో నిన్ను ఆ ఇంట్లోకి వెళ్లేలా చేస్తానని అంటుంది. వల్లీ మాత్రం నేను చచ్చినా నీతో చేతులు కలపను, రేపు నాకు పుట్టబోయే బిడ్డ నా గురించి తెలుసుకొని నా తల్లి రాక్షసి అనుకోకూడదని అంటుంది. నా బిడ్డకి నేను మంచి తల్లిని అవ్వాలని అనుకుంటున్నానని వల్లీ అంటుంది. మరోవైపు అంజలి కోసం చందు రాత్రి అంజలి ఇంటికి వెళ్తాడు.చందుని చూసి అంజలి తలుపు వేసేస్తుంది. నీతో మాట్లాడాలి తలుపు తీయ్ అంజలి అని చందు బతిమాలుతాడు. నీతో మాట్లాడటానికి మాటల్లేవని అంజలి అంటుంది.
నీ జీవితం పాడైపోయింది.. ఇప్పుడు నా జీవితం కూడా పాడైపోయింది.. అది చెప్పడానికే వచ్చానని చందు ఎమోషనల్ గా చెప్తాడు. నువ్వు కూడా నన్ను పట్టించుకోకుండా దూరం పెడితే నా వల్ల కాదని.. ఈ బతుకు మీదే విరక్తి పుడుతుందని అంటాడు. నీకు నా ముఖం చూడటం ఇష్టం లేకపోతే ఊరి నుంచే వెళ్లిపోతానని అంటాడు. అంజలి ఎంతకీ తలుపు తీయకపోవడంతో వెళ్లిపోతుంటే అంజలి డోర్ తీస్తుంది. అంజలి ఇంట్లోకి చందు వెళ్తాడు. నీ జీవితానికి ఏమైంది చందు అని అంజలి అడుగుతుంది. వల్లీ గురించి చందు చెప్తూ.. నువ్వు మోసపోయావా అంజలి, తను రాక్షసి అని అంటాడు. నా బాధ పంచుకోవడానికి ఎవరూ లేరు, నువ్వు దేవతలా వచ్చావని అంజలి చేతులు పట్టుకుంటాడు చందు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అంజలి ధైర్యం చెప్తుంది. సాగర్, నర్మద ఎడమొఖం పెడమొఖం పెడితే ధీరజ్, ప్రేమ భోజనం తీసుకొస్తారు. నర్మద పైస్థాయి ఉద్యోగం కోసం పరీక్షలు రాయాలని చెప్తుంది. తిరుపతి గదిలోనే మందు సెటప్ పెట్టి ఫస్ట్ నైట్ కావాలని సుకన్య మీదకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






