Home

»

Tv News

Karthika Deepam2: సూరజ్ జ్యోత్స్న ఒక్కటవుతారా.. దక్షిణామూర్తి ఏం చేయనున్నాడు!

Nov 21, 2026 9:29AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2' . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-835... లో మాలిని దక్షిణామూర్తి, సూరజ్ లతో జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కట్టకుండా మంచి పని చేశాడని అంటుంది. మీకు ఇది చాలా కష్టంగా ఉంటుంది మామయ్య గారు, నేను సూరజ్ ఈ విషయం వదిలేసినా మీరు వదల్లేరని మాలిని అంటుంది. శరీరానికి తగిలిన గాయం పోతుంది కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా పోదని, జ్యోత్స్న ఇలా చేస్తుందని అనుకోలేదని దక్షిణామూర్తి అంటాడు. సూరజ్ కి జ్యోత్స్న మీద ప్రేమ ఉందని, పదరా జ్యోత్స్నని అడుగుదామని దక్షిణామూర్తి అంటాడు. నిన్ను పెళ్లి చేసుకుంటే రెండు కోట్లు ఏంటి ఆస్తి మొత్తం తనదే అవుతుందని, ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుందో అడుగుదామని అంటాడు. మాలిని మనసులో మామయ్య గారు ఇద్దరిని కలిపేలా ఉన్నారని, ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. పదరా మనం కూడా వెళ్దామని మాలిని అంటే అవసరం లేదు.. దీన్ని ఇక్కడితో వదిలేద్దామని సూరజ్ అంటాడు.

 

జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్తుంటే పారిజాతం అడ్డుకుంటుంది. సిగ్గు లేదా నీకు వద్దు అన్న చోటకి వెళ్తావా అని అంటుంది. నేను వెళ్తా నన్ను అడ్డుకోకని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్, దీప ఇద్దరు వచ్చి.. జ్యోత్స్న ఆగదు, నీ మాట ఎందుకు వినాలని పారిజాతాన్ని అంటారు. జ్యోత్స్నని ఆపాలంటే వాళ్ల అమ్మ అయినా నాన్న అయినా ఆపాలని, నువ్వు ఎవరని అంటారు. జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్తే వాడి చుట్టూ తిరుగుతుందని, మాలిని చూపించిన సంబంధం సూరజ్ పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడని పారిజాతం అంటుంది. కార్తీక్, దీప ఇద్దరు జ్యోత్స్నని వెళ్లమని అంటారు. పారు వద్దనడంతో కార్తీక్ పారుని లాగేస్తాడు. జ్యోత్స్న విషయంలో నువ్వు మళ్లీ ఏమైనా చేస్తే ఊరుకోనని కార్తీక్ పారుతో అంటాడు. జ్యోత్స్న సూరజ్ ఎప్పటికీ కలవరని పారిజాతం అనుకుంటుంది. జ్యోత్స్న మాలిని ఇంటికి వస్తుంది. జ్యోత్స్నని మాలిని ఆపేస్తుంది. నీ తాలూక వాళ్లు ఎవరూ లేరని అంటుంది.

జ్యోత్స్న మా తాత దక్షిణామూర్తి ఉన్నాడని అంటే ఎవరమ్మా నువ్వు, నువ్వు నా మనవరాలివి కాదు శివన్నారాయణ మనవరాలివని దక్షిణామూర్తి అంటాడు. నిన్నటి వరకు ఈ విషయంలో నాకు మీ తాతకి మధ్య గొడవ అయ్యేదని, కానీ మీ తాత గెలిచాడని అంటాడు. నీది నా కూతురి పోలిక కాదు, శివన్నారాయణలా స్వార్థపరురాలివని, నువ్వు నా కూతురి కడుపున ఎలా పుట్టావమ్మా అని దక్షిణామూర్తి అంటాడు. నువ్వు నా గురించి మా అమ్మ గురించి మాట్లాడటానికి సరిపోవని సూరజ్ అంటాడు, జ్యోత్స్నని వెళ్లిపోమని, పనిమనిషితో గెంటించేయమని అంటాడు. శివన్నారాయణ మనవరాలు తెచ్చుకోదులే అని వెళ్లిపోమని దక్షిణామూర్తి చెప్తాడు. ఇంటికి వచ్చాక కార్తీక్, దీప ఇద్దరు జ్యోత్స్నని ఎందుకు సూరజ్ ఇంటికి వెళ్లావని తిడతారు. నీ తప్పు లేకుండా దోషిలా నిల్చోకని దీప అంటుంది.సూరజ్ కి జ్యోత్స్న ఫోన్ చేస్తే కట్ చేస్తాడు‌. వాయిస్ మెసేజ్ లో నేను మాట్లాడాలని.. ఆ ముగింపు నాకు తెలియాలని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com