
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -614 లో.....కార్తీక్ దగ్గరికి నర్సు వచ్చి.. మీ నాన్న గారు కూతురు వచ్చారని చెప్తుంది. అయన ఎందుకు వచ్చాడని కార్తీక్ కంగారుగా లోపలికి వెళ్తాడు. ఏంటి మాస్టారు ఇలా చెప్పకుండా అని కార్తీక్ అంటాడు. శౌర్య నీతో మాట్లాడాలని అంది. నీ ఫోన్ కలవట్లేదు. దాంతో తీసుకొని వచ్చానని శ్రీధర్ చెప్తాడు. అప్పుడే డాక్టర్ హారిక గైనకాలజిస్టుని తీసుకొని వస్తుంది. దీపకి కొన్ని టెస్ట్ లు చెయ్యాలని డాక్టర్ అంటుంది. తల్లి బిడ్డా క్షేమంగా ఉండేలా చూడండి డాక్టర్ అని శ్రీధర్ అనగానే అదేంటి వద్దనుకుంటే కదా ఇదంతా అని గైనకాలజిస్టు అంటుంది. అదేంటి వద్దనుకోవడం ఏంటని శ్రీధర్ అడుగుతాడు. హారిక సైగ చెయ్యడంతో గైనకాలజిస్టు సైలెంట్ గా ఉంటుంది.
మాస్టారు మీరు శౌర్యని తీసుకొని వెళ్ళండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్య వెళ్లిపోతు మా అమ్మకి కడుపులో బిడ్డకి జ్వరం వచ్చింది కదా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ కి శౌర్య చెప్తుంది. దీపకి బొమ్మని ఇచ్చి వెళ్తుంది శౌర్య. ఆ బొమ్మని చూస్తూ దీప ఉండిపోతుంది. దీపకి డాక్టర్ కొన్ని టెస్ట్ లు చెయాలని చెప్తారు. మరొకవైపు దాస్ ను జ్యోత్స్న కలుస్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు రమ్మన్నావ్.. నేను నీ కూతురని నిజం చెప్పడానికి రమ్మన్నావా అని జ్యోత్స్న అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నువ్వు నా కూతురు కాదని అని దాస్ అంటాడు. అయితే చనిపోయిన మా అమ్మ మీద ఒట్టు వెయ్ అని జ్యోత్స్న అనగానే దాస్ షాక్ అవుతాడు. మీరు అసలు నిజం చెప్పాలి అనుకుంటే నేను ఉండను.. చచ్చిపోతాను కానీ నేను చచ్చిపోయే ముందు మాత్రం దీపని చంపే చస్తాను.. మీరు నిజం చెప్పిన మరుక్షణం దీప ఉండదని జ్యోత్స్న అనేసి వెళ్తుంది. అదంతా దూరం నుండి వింటున్న దశరథ్ షాక్ అవుతాడు. జ్యోత్స్న వెళ్ళాక దాస్ దగ్గరికి వస్తాడు దశరథ్. చూసావా అన్నయ్య ఎలా మాట్లాడుతుందోనని దాస్ అంటాడు. ఇప్పుడే వెళ్లి అందరికి నిజం చెప్పేస్తానని దశరథ్ అనగానే.. చెప్తే దీపకే నష్టం అన్నయ్య అని దాస్ అంటాడు. అయిన దశరథ్ వినకుండా వెళ్తాడు.
మరొకవైపు శ్రీధర్ ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటే.. ఏమైందని కాంచన అడుగుతుంది. డాక్టర్ అన్నదాని గురించి ఆలోచిస్తున్నానని శ్రీధర్ అంటాడు. నాకు ఎందుకో కార్తీక్ ఏదో దాస్తున్నాడనిపిస్తుంది.. నువ్వు కార్తీక్ చెప్పగానే నమ్మేసావు తప్పు చేసావని కాంచనతో శ్రీధర్ అంటాడు. తన బిడ్డ గురించి వాడు ఆలోచిస్తాడు కదా అని కాంచన అంటుంది. మరొకవైపు దీప డల్ గా ఉంటే కార్తీక్ వచ్చి తనతో మాట్లాడతాడు. అయిన పట్టించుకోపోయేసరికి తనకి చెక్కిలిగింతలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







