Home

»

Tv News

Illu illalu pillalu: అమూల్యకి తన పగ గురించి చెప్పిన భద్రవతి.. తండ్రి మీద సాగర్ ఫైర్!

Mar 11, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-415 లో.. అమూల్య, విశ్వ, భద్రవతి, సేనాపతి, రేవతి, ముసలావిడ అందరు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. ఇక అప్పుడే భద్రవతికి పొలమారుతుంది. ఏంటని సేనాపతి అడుగగా.. ఆ రామరాజు గాడిని అవమానిస్తే భళే ఆనందంగా ఉందని భద్రవతి అనగానే సేనాపతి, విశ్వ నవ్వుకుంటారు. వాడు కోరలు పీకేసిన పాము అక్క.. వాడి పని అయిపోయింది.. ‌మనం అవమానిస్తే ఏం అనలేడు అక్క అంటూ భద్రవతితో సేనాపతి చెప్పుకుంటూ నవ్వుతాడు. అప్పుడే అమూల్య ఫుల్ కోపంగా.. మీరందరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటుంది.

మీరు ఎంత అవమానించినా మీరు బాగుండాలనే కోరుకున్నాడు మా నాన్న.. అలాంటిది మీరు ఆయనని అవమానిస్తున్నారని అమూల్య కోపంగా అంటుంది. ఏం తెలుసే నీకు మాకు పగ గురించి అని భద్రవతి అంటుంది. నువ్వు పుట్టుకముందు నుండే ఉన్నాయని భద్రవతి అంటుంది. మీ నాన్న మా ఇంట్లో డ్రైవర్.. మా నాన్నని చెల్లిని నమ్మించి మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు.. దాంతో మా నాన్న గుండెపోటుతో చచ్చాడని భద్రవతి ఎమోషనల్ అవుతుంది. అందుకే వాడి పతనం చూసేదాకా మాకు సంతృప్తి ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది భద్రవతి. రేయ్ నీ భార్యని కంట్రోల్ లో పెట్టుకోరా అని విశ్వతో సేనాపతి అనేసి వెళ్ళిపోతాడు. మరోవైపు ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారు. రేయ్ మీ నాన్నకి నిజం చెప్పేద్దామని ప్రేమ అంటుంది. వద్దని ధీరజ్ అంటాడు. లేదురా.. సాగర్ బావ ముందు చెప్పలేదని ఎంత పెద్ద గొడవ అయింది. నువ్వు చెప్పు పదా అని ధీరజ్ ని బలవంతంగా తీసుకెళ్తుంది ప్రేమ. అదే సమయంలో సాగర్,  నర్మద  మాట్లాడుకుంటారు. పదా సాగర్ మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు.. మీ నాన్న క్షమిస్తాడని ఒప్పించి సాగర్ ని తీసుకొస్తుంది నర్మద. ఇక రామరాజు దగ్గరికి ధీరజ్  వచ్చి.. నాన్న సొంతంగా కార్ కొనుక్కొని డ్రైవర్ గా చేద్దామని అనుకుంటున్నాను ఇది ప్రేమ ఐడియా అని ధీరజ్ అంటాడు. మరి డబ్బులు అని అనగా‌‌ డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకుంటున్నానని ధీరజ్ అనగానే మరి డబ్బులు ఏమైనా కావాలంటే మీ నాన్నని అడుగురా అని వేదవతి అనగానే వద్దని ధీరజ్ అంటాడు. మరి రైస్ మిల్ చూసుకుంటే దొరబాబులా ఉంటావ్ కదరా అని వేదవతి అనగానే ధీరజ్ సైలైంట్ గా ఉంటాడు. వాడి మౌనం చూస్తే తెలియట్లేదా వాడికి ఇష్టం లేదు.. వాడిని బలవంత పెట్టకు.. అయినా వాడేమైనా ఎవరినో మోసం చేసి అక్రమంగా జాబ్ తెచ్చుకోవడం లేదు కదా అని సాగర్ గురించి రామరాజు అంటాడు. అప్పుడే వెనకాల సాగర్, నర్మద వస్తారు. ఆ మాటలు విని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు సాగర్.

ఇక తనతో పాటు నర్మద కూడా గదిలోకి వెళ్తుంది. అతను మారడు.. కొడుకుని ఎప్పటికి అర్థం చేసుకోలేడు అంటూ సాగర్ మాట్లాడుతుంటే.. నువ్వు మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నర్మద అంటుంది. లేదు .. నేను చేసిన తప్పేంటి నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకున్నానని , అయినా ఈ ఇంట్లో ఎవరేం తప్పు చేయలేదా అని సాగర్ కోపంగా అనేసి వెళ్ళిపోతాడు. ఇక రాత్రి పన్నెండు గంటలకి ప్రేమకి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు ధీరజ్. నర్మద, సాగర్, చందు, శ్రీవల్లిలకి ఫోన్ చేసి రమ్మని అంటాడు ధీరజ్. ఇక ప్రేమని ఎత్తుకొని బయటకి తీసుకొని వస్తాడు ధీరజ్. లైట్స్, బెలూన్స్, మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా డెకరేట్ చేస్తాడు ధీరజ్. ఇక అందరు కలిసి ఫుల్ హ్యాపీగా ఉంటారు. ప్రేమ కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com