
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -213 లో..... రుద్ర కుటుంబం మొత్తం హోలీ సెలెబ్రేషన్స్ లో ఉంటుంది. గంగ రుద్ర ఒంటి పై కలర్ అంటకుండా ఉండాలని పోటీ పెట్టుకుంటారు. రుద్ర షర్ట్ కి కొంచెం కలర్ అంటుతుంది. దాంతో రుద్ర ఓడిపోతాడు. ఇప్పుడు రుద్ర బావ ఓడిపోయాడు కాబట్టి రుద్ర బావ ఇంకా నా చెల్లి హోలీ ఆడాలని రంగా అనగానే మనం వచ్చిందే హోలీ ఆడడానికి కదా అని రుద్ర అంటాడు.అవును అన్నయ్య ఇప్పుడు హోలీ ఆడడం కోసమే ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఆట అంటావేంటి అని గంగ అంటుంది.
ఆడడం అంటే కలర్ లు పూసుకోవడం కాదు నువ్వు బావ ఒకరికొకరు కలర్ లు రాసుకోవాలని రంగా అనగానే గంగ సిగ్గుపడుతుంది. మరొకవైపు ఇందుమతికి ఇంకా తన భర్తకి రంగ డాన్స్ నేర్పిస్తాడు. అందరు హోలీ సెలెబ్రేషన్స్ లో సరదాగా ఉంటారు. వీరు, ఇషిక ఇద్దరు అదంతా చూసి ఓర్వలేకపోతారు. రుద్రని చంపాలని వీరు కత్తి పట్టుకొని వెళ్తాడు. రుద్ర ని పొడవబోతుంటే అప్పుడే ప్రీతి వస్తుంది. దాంతో వీరు ఆగిపోతాడు.. ఆ తర్వాత రంగా మజ్జిగ అంటూ అందరు తాగే దాంట్లో డ్రింక్ కలుపుతాడు. ఒకరి తర్వాత ఒకరు అందరు అది తాగుతారు.
అందరూ డ్రింక్ చేసి డాన్స్ చేస్తారు. అది రుద్ర తాగి గంగతో మాట్లాడతాడు. నీ కళ్ళు బాగుంటాయి అవి మాట్లాడుతాయంటూ రుద్ర అంటుంటే గంగ సిగ్గు పడుతుంది. ఇందాక నీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా ఇప్పుడు నా ప్లాన్ చూడు అంటూ హోలీ సెలెబ్రేషన్స్ లోకి రౌడీ లు రావడం వీరుకి ఇషిక చూపిస్తుంది. రౌడీలు కావాలనే అక్కడున్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. అదంతా రుద్ర చూసి వాళ్ళతో గొడవపడతాడు. రౌడీలు రుద్రని లాక్ చేస్తారు. దాంతో గంగ రంగంలోకి దిగుతుంది. రౌడీలని కొడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







