.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చేసింది. ఈ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఇక కాన్సెప్ట్ వచ్చి సీరియల్ పురం మూడొందల పండగా అన్నమాట. ఈ సీరియల్స్ మెగా మహోత్సవం ఎపిసోడ్ కి సంధ్యారాగం, వేయి శుభములు కలుగు నీకు, వసుంధర, మెరుపు కలలు, ఆరోప్రాణం సీరియల్స్ కి సంబందించిన వాళ్లంతా వచ్చారు. ఇక అది ఐతే మెరుపు కలలు సీరియల్ హీరోయిన్ సంయుక్త మీద వేసిన డైలాగ్ ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చింది. "నీ కళ్ళల్లో అంత మెరుపు ఉందంటే నువ్వు మెరుపు కలల్లో సంయుక్తవి నువ్వే కదా" అన్నాడు ఆది. "అవును కానీ మీ కళ్ళల్లో ఇంత కక్కుర్తి కనిపిస్తుందంటే మీరు ఆదినేనా" అనేసింది.
ఇక ఇందులో ఫైమా ఒక షావుకారు గెటప్ లో వచ్చింది. పక్కనే 1 మినిట్ నాటీ నరేష్ ని వెంటబెట్టుకొచ్చింది. అదిగో "ఆడది" అని ఫైమా అనేసరికి "అది ఆడది కాదె ఆది " అంటూ నరేష్ కరెక్ట్ చేసాడు. ఆది ఫుల్ నవ్వుతూ ఉన్నాడు. ఇంతలో ఒక సీరియల్ యాక్టర్ "ఏంటి ఈ మధ్య నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్ ఎం వాడతన్నావ్ ఏంటి " అని అడిగింది. "ఈమధ్య నేను డేట్ చేస్తున్నానమ్మా " అంది. వెంటనే నరేష్ "అది డేట్ కాదే డైట్ " అన్నాడు. ఇక ఆది ఐతే "అరె 1 మినిట్టు అది కరెక్ట్ గానే చెప్పిన్దిరా నువ్వే " అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇంతలో ఇంకో సీరియల్ అతను "ఏంటి ఆంటీ రాత్రి చాటింగ్ చేస్తే రిప్లై ఇవ్వవు " అన్నాడు. "నేనీమధ్య చాలా మందితో చీటింగ్ చేస్తున్నానబ్బాయ్" అంది. వెంటనే ఆది "అరేయ్ గుడుగుడు అది కరెక్ట్ గానే చెప్పిన్దిరా " అని కౌంటర్ ఇచ్చాడు. "సంధ్యారాగం" అంటూ నరేష్ అనేసరికి "వాళ్ళు సంధ్యా రాగం నేను సందులో రాగం"అని చెప్పింది ఫైమా. "అరేయ్ 1 మినిట్టు అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే అన్నాడు ఆది. ఇక ఇక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ లు జరుగుతాయి ఆడియన్స్ కూడా లైవ్ వోటింగ్ ఇస్తారు అంటూ రష్మీ చెప్పింది. బెస్ట్ ఎంటర్టైనర్ - నవరసాలు విత్ సీరియల్ ఆర్టిస్ట్స్ , బెస్ట్ నెగటివ్ రోల్ , బెస్ట్ సపోర్టింగ్ రోల్, హుక్ స్టెప్ ఛాలెంజ్. ఇక వోటింగ్ టైం అనౌన్స్ చేసాక అందరూ ఓట్లు వేశారు. ఇక ఆ ఓట్లను కూడా లెక్కబెట్టారు. ఐతే బెస్ట్ జోడి కింద వచ్చిన ఓట్లలో ఒకటి నోటాకు వేసినట్టు రష్మీ చెప్పింది.




.webp)
.webp)
