.webp)
కూకు విత్ జాతిరత్నాలు షో లేటెస్ట్ ప్రోమో చూస్తే సమ్మర్ లో చిన్నప్పుడు ఆదుకున్న గేమ్స్ అన్నీ ఈ షోలో కనిపించాయి. చిన్నప్పుడు మనమంతా ఎక్కినా చిన్న జెయింట్ వీల్ కూడా ఇక్కడ కనిపించింది. ఇందులో జడ్జెస్ అంతా ఎక్కి పై నుంచి కింద గిరగిరా తిరిగారు. ఇక రకరకాల గెటప్స్ తో జాతిరత్నాలు, కుక్కులు వచ్చారు. ఇక ముందుగా రిపోర్టర్ గెటప్ లో వచ్చింది దీపికా. అసలే తెలుగు రాదు అందులోనూ "ఈ జాతర వేడుకల అవమానం" అని చెప్పింది.
వెంటనే పక్కనే ఉన్న నిఖిల్ "అవమానం కాదు ఆహ్వానం" అని కరెక్ట్ చేసాడు. ఇక స్పెషల్ చీఫ్ గెస్ట్ గా యాదమ్మ రాజు వచ్చాడు. వెంటనే రాకింగ్ రాకేష్ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. వెంటనే రాజు వద్దు ఫొటోస్ ఇప్పుడు వద్దు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నప్పుడు బాడీ గార్డ్స్ ని పెట్టుకోవాలి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అని అన్నాడు. మీకు జరిగాయా సర్ అంటూ ప్రదీప్ అడిగాడు. ఎస్ జరుగుతూ ఉంటాయి మమ్మల్ని రాళ్లతో కొడుతూ ఉంటారు అన్నాడు.
వెంటనే హరి వచ్చాడు ఇక పల్లవి గౌడ కూడా క్యూట్ లంగా వోణిలో వచ్చింది. "నేచర్ విడదీస్తున్న పల్లవి గారు నన్నే ఎంచుకుంటున్నారు. ఎందుకు " అన్నాడు. "కర్మ అనేది ఉందిగా ఇదే ఖర్మ అంటే " అంది పల్లవి. ఇక తర్వాత ఇమ్మానుయేల్ తాగుబోతు గెటప్ లో తాగుతూ వచ్చాడు. యాదమ్మ రాజు లేచి " హలో సెలబ్రిటీ" అని తనను తానూ పరిచయం చేసుకున్నాడు. "ఎవరు సెలెబ్రిటీనా తాగుబోతోడు ఏది చెప్పిన నమ్మేస్తాడు అనేనా సెలబ్రిటీ ఎవుర్రా. ఈ ఊరికి పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు అంటే అది నేనే " అంటూ రాజుని ఒక్కటి పీకాడు. ఇక యాదమ్మ రాజుని ఎందుకు పిలిచారంటూ ఇమ్ము అడిగాడు. "మన ఊరేమన్నా దివాళా తీసే పరిస్థితిలో ఉందా కొంచెం ఎక్కువ చందా వేసుకుని మంచి వాళ్ళను పిలవచ్చుగా " అని అడిగాడు. ఇక జడ్జ్ శ్రీదేవి దగ్గరకు " మా అమ్మ ఇక్కడే ఉంది " అని మణికంఠ అనేసరికి "అయ్యో నాకు ఇలాంటి బిడ్డ వద్దు" అనేసింది.




.webp)
.webp)
