ఒక లవ్ కోసం...ఈవిడ ఒకడి తోటి ఎఫైర్...
on Jun 13, 2025
కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి మానస్, సత్య వచ్చారు. "అసలు మీరిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది " అంటూ తేజస్విని అడిగింది. "ఒక గొడవ వలన కలిసాం..నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసావ్ అంటూ నన్ను అడిగింది " అని చెప్పాడు మానస్. "వాళ్లంటే ఎవరు" అని అడిగింది తేజు. "పేర్లెందుకులే" అంది సత్య. "ఐతే ఎవరో ఒక కాకి" అంది తేజు. ఇక తర్వాత మానస్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "10 త్ లో 93 , ఇంటర్ లో 98 పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. నాకు హీరో అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా 13 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది.
నాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది." అని చెప్పాడు మానస్. "నా స్టోరీ ఎలా ఫ్లిప్ అయ్యిందంటే ఒక లవ్ కోసం ..ఫైనల్ వాళ్ళ నోటి నుంచి వినిపించిన మాటలు అవే..దాని కారణంగా ఫామిలీలో కొన్ని పరిస్థితులు మారిపోయాయి " అంటూ చెప్పింది సత్య. "ఇంట్లో ఉన్నవాళ్లను తిన్నావా అని కూడా అడగని ఈవిడ ఒకడి తోటి ఎఫైర్ " అంటూ తేజు కూడా ఏదో చెప్పుకొచ్చింది. ఐతే ఇంతకు శ్రీసత్య, తేజు ఎం చెప్పారు అన్నది ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. ఇక శ్రీసత్య బిగ్ బాస్ 6 ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. కొన్ని షోస్, సీరియల్స్ లో నటించింది. రామ్ పోతినేని అంటే పిచ్చ ఇష్టం. అలాగే కొన్ని మూవీస్ లో సైడ్ రోల్స్ లో నటించింది కూడా. ఇక సత్య మెహబూబ్ తో కలిసి రీల్స్ అవి చేస్తూ ఉంటుంది. అలాగే అంజలి పవన్ వాళ్ళ అమ్మాయి చందమామతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది సత్య.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
